ఇక వెళ్లొస్తా.. పేర్ని నాని ముందస్తు వీడ్కోలు..

Publish Date:Apr 5, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం దగ్గర పడింది. మరో ఐదారు రోజుల్లో, ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం కొలువు తీరనుండి. అదే రోజున  గత మూడేళ్ళుగా మంత్రులుగా ఓ వెలుగు వెలిగిన మంత్రుల పేర్ల ముందు మాజీ వచ్చి చేరుతుంది. బుగ్గకారు బై బై చెప్పేస్తుంది. మంత్రి మాములు ఎమ్మెల్యే అయిపోతారు. శతకోటిలో తానూ ఒకరై పోతారు. ఈ నేపధ్యంలో రేపటి మాజీల మనోభావాలు ఎలా ఉంటాయో, వేరే చెప్పనక్కర లేదు. అయితే, అందరి మాట ఎలా ఉన్నా, రవాణా మంత్రి పేర్ని నాని మాత్రం, అందుకు మానసికంగా తయారైనట్లే కనిపిస్తున్నారు. ఆయన తమ మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్నలారీ, బస్సు యజమానుల సంఘాల సభ్యులకు ముందుగానే   వీడ్కోలు కూడా చెప్పేశారు.  

బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్‌ ఆపరేటర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘వన్‌ ఇండియా, వన్‌ బస్‌’ వెబ్‌సైట్‌ను మంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన, మనసులోని బాధని మరో రూపంలో బయట పెట్టుకున్నారు. ‘ఈనెల 11 న కొత్త మంత్రులు వస్తున్నారు’ అని చెప్పిన నాని, అయినా తాను మాజీ అయినా, రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా,  తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు కొత్త మంత్రితో పంచుకుంటానని చెప్పుకొచ్చారు. మూడేళ్ల పాటు లారీలు, బస్సు యజమానుల సంఘాలతో కలిసి పనిచేసినవాడిగా మీ సమస్యలను కొత్త రవాణా మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని, హమీ ఇచ్చారు. 

అయితే, ఈ అసోసియేషన్లతో ఇదే చివరి సమావేశం అనుకుంటున్నా, అన్నప్పుడు మాత్రం ఆయన గొంతు కాసింత జీర పోయింది. అయితే, నిజానికి నాని ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో కానీ, మాజీలు అయిన మా పవర్ తగ్గదని, చెప్పడం ఆయన ఉద్దేశమా, అని వెహికల్ ఓనర్స్ గుసగుసలు పోతున్నారు. ఆలాగే, నడరు కాకపోయినా, ముఖ్యమంత్రితో మంచి అనుబంధం ఉన్న నాని వంటి మాజీలు సూపర్ మంత్రులుగా పనిచేస్తారా, ఏంటి అనే రాజకీయ చర్చకు నాని వాఖ్య శ్రీకారం చుట్టింది అంటున్నారు   

అదలా ఉంటే, ఇదే సమయంలో మంత్రి పేర్ని నాని, ఈ మూడేళ్ళలో రవాణా శాఖ అధికారులతో తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన సమయంలో, ‘రవాణా శాఖలో ఎవరి మాటా వినని ముగ్గురు సీతయ్యలు కృష్ణబాబు (ముఖ్యకార్యదర్శి) సీతారామాంజనేయులు,( కమిషనర్‌) సురేంద్రబాబు (ఆర్టీసీ ఎండీ)గా ఉన్నారని,  తెలిసి కాసింత ఖంగు తిన్నానని సరదాగా చెప్పుకొచ్చారు. రాకరాక మంత్రి పదవి వస్తే.. ఇదేమిటి అనుకున్నాను. వీళ్లు ముగ్గురూ ఎవరి మాటా వినరు.. వీళ్లు రాజకీయ నేతలను, మంత్రులు, ఎమ్మెల్యేలను లెక్కచేయరు. హెడ్‌ స్ట్రాంగ్, టఫ్‌గా ఉంటారని చెప్పేవారు. కానీ వారు ఎప్పుడూ అలా వ్యవహరించలేదు. నేను ఏది చెప్పినా ఎంతో పాజిటివ్‌గా స్పందించేవారు’ అంటూ  అధికారులకు కూడా మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు చెప్పారు.  తమ మనసులోని బాధను,భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానూ ఒకప్పుడు, బస్సు ఆపరేట్ చేశానని, బస్సు, లారీ ఆపరేటర్ల కష్టాలు తనకు  కూడా తెలుసునని చెప్పారు. హోం, స్టేట్‌ ట్యాక్స్‌ విషయంలో రాష్ట్రంలో ‘వన్‌ ఇండియా వన్‌ ట్యాక్స్‌’ విధానం ద్వారా వెళ్దామని ముఖ్యమంత్రికి చెప్పానని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని మంత్రి నాని తుది పలుకులు పలికారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.