రాజకీయాలలో హాస్యం పండించడంలో దిట్టలు చాలా తక్కువ మంది ఉంటారు. వారు ఏం మాట్లాడినా జనం సీరియస్ గా తీసుకోరు. హాయిగా నవ్వుకుంటారు. వారి ప్రెస్ మీట్లకు మీడియా ప్రతినిథులు ఉత్సాహంగా హాజరౌతారు. ఎందుకంటే వారి మాట్లల్లో వెల్లివిరిసే హాస్యం పాఠకులను, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
అలాంటి వారిలో ప్రముఖంగా విశ్వశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాతి స్థానం కాకపోయినా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా అలా హాస్యం ఒలికించే పొలిటీషియన్లలో ముందు వరుసలో ఉంటారు. మల్లారెడ్డి రూటే సెపరేటు. ఆయన మాటే డిఫరెంటు. అందులో సందేహం లేదు. ఆయన ఏం మాట్లాడినా వెంటనే సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోతుంది. ఆయన సీరియస్ గా వేసే జోకులకు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
గతంలో ఒక సారి ఆయన తన ఎదుగుదలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. కష్టపడ్డా.. పాలమ్మా, పూలమ్మా బోర్ వెల్ నడిపించా.. కాలేజీలు పెట్టా అంటే చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా కూడా ఆయన బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సరదాగా ఉన్నాయంటూ నెటిజన్లు అంటున్నారు.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోమ్ శాఖ మంత్రి మహముద్ అలీ, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన ప్రసంగంలో బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను ఆయన కోరారు. పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని అన్నారు. కేసులను త్వరగానే పరిష్కరిస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసించారు.
పోలీసులు కూడా మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు. పోలీసులను చూస్తే దొంగలు గజగజ వణికిపోవాలని అన్నారు. తాజాగా మంత్రిగారు చెప్పిన మాటల్లో ట్రోల్ చేయడానికి ఏమీ లేదు కానీ ఆయన నవ్వూతూ చెప్పిన ఈ మాటలు గతంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పోలీసులు స్టిఫ్ నెస్ కు..ఫిట్ నెస్ కు ఉదాహరణగా ఉండాలి అని చెప్పడాన్ని గుర్తుకు తెచ్చాయి. బొజ్జ పెంచుకున్న పోలీసులకు ఇంక్రిమెంట్ ఇవ్వద్దని అప్పట్లో ఎన్టీఆర్ ఆదేశించారు. మల్లారెడ్డి నవ్వుతూ చెప్పినా వాస్తవమే చెప్పారు. పోలీసులు ఫిట్ నెస్ పై దృష్టి నిలపాలి అని నెటిజన్లు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-mallareddy-suggetion-to-home-minister-39-156231.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.