రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాలి : మంత్రి లోకేష్

Publish Date:May 22, 2026

Advertisement

 

పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్..

సేంద్రియ సాగు చేస్తున్న ద్వారకానాథ రెడ్డిని అభినందించిన మంత్రి..

రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముందుగా సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న  లోకేష్‌కు  రైతు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతిలు స్వాగతం పలికారు. 

 

 

17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న ద్వారకానాథ రెడ్డి కుటుంబం

పెనికలపాడుకు చెందిన రైతు ద్వారకానాథ రెడ్డి, ఆయన సోదరుడు రమణారెడ్డిలు గత ఐదేళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పంటలు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం వంటి వాటిని ఒకదానికొకటి అనుసంధానం చేసి సమీకృత సేంద్రీయ సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం అర్జిస్తున్నారు. తమ పొలంలో  మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, చిన్న నిమ్మ, నేరేడు, జామ, మునగ, రామాఫలం, సీతాఫలం పంటల సాగుతో పాటు 250 వరకు నాటుకోళ్ల పెంపకం, 60 వరకు పొట్టేళ్లు, చేపల సాగు చేస్తున్నారు.

 

 

సేంద్రియ సాగు పద్ధతులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్

ఈ సందర్భంగా రైతు ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మంత్రి సంభాషించారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి గల కారణాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో 70 ఏళ్ల వయస్సున్న సేంద్రియ రైతు లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని తాము సేంద్రియ సాగు చేస్తున్నామని వివరించారు. మొదట ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నిలదొక్కుకున్నామని చెప్పారు.

 

 

 వ్యవసాయ అధికారులు సేంద్రియ సాగులో మెళకువలపై తిరుపతిలో శిక్షణ అందించారని, బయో రీసెర్చ్ సెంటర్ కేటాయించారని తెలిపారు. తమ పొలంలోనే సహజ ఎరువులు, 32 రకాల జీవ వైవిధ్య గింజల తయారీ చేపట్టినట్లు వివరించారు. పురుగుమందులు, రసాయన ఎరువులు అవసరం ఇప్పుడు తమకు లేదన్నారు. పంట పెట్టుబడి తగ్గిపోవడంతో సమీకృత సేంద్రీయ సాగు ద్వారా నెలవారీ ఆదాయం పొందుతున్నామన్నారు. 

 

 

ఒక్క ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టవచ్చని తెలిపారు. 250 నాటుకోళ్ల పెంపకం ద్వారా పొలంలో కలుపు తీసే పనిలేదని, పురుగుమందుల అవసరం లేదని వివరించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మామిడి చెట్ల ద్వారా ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆదాయం పొందుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పరంగా మరింత సహకారం అందిస్తే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేయవచ్చని ధీమావ్యక్తం చేశారు.

రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ .. పంట పొలాల్లో అధిక రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం ద్వారా భూసారం దెబ్బతినడంతో పాటు రైతుకు సాగు పెట్టుబడి వ్యయం అధికమవుతోందన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు గారి లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని రైతులను సేంద్రియ సాగువైపు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 

కేంద్రం కూడా ఇందుకు కృషిచేస్తోందని వివరించారు. చిరుధాన్యాల సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాయలసీమలో బిందు సేద్యానికి మరింత అండగా ఉంటున్నామని, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు స్థానిక రైతులను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు ప్రభుత్వం కూడా మద్దతుగా ఉంటుందన్నారు. వ్యవసాయ క్షేత్రం మొత్తం కలియతిరిగి వివిధ పంటల సాగును మంత్రి పరిశీలించారు. 

 

 

అనంతరం 32 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి కుంటను మంత్రి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీకృత సేంద్రియ సాగులో అద్భుతాలు సృష్టిస్తూ.. స్థిరమైన ఆదాయం పొందుతున్న మునగాల ద్వారకానాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన మామిడిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రుచి చూశారు. అనంతరం రైతు ద్వారకానాథ రెడ్డి కుటుంబం మంత్రి లోకేష్ కు మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతి, ద్వారకానాథ రెడ్డి సోదరుడు రమణారెడ్డి, ద్వారకానాథ రెడ్డి మాతృమూర్తి నారాయణమ్మ, రమణారెడ్డి కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి, కుమార్తె జ్యోతికా రెడ్డి పాల్గొన్నారు.


 

By
en-us Political News

  
భారతదేశ రాజకీయ, చట్టపరమైన రంగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించడంతో స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది
కేరళ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది.
నాగోల్‌లో ఉన్న జగ్జీవన్‌రామ్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు రెండ్రోజుల వార్షిక సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక్కసారిగా ఎబోలా వైరస్ భయాలు కలకలం రేపాయి.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 100 కిలోలకు పైగా స్వచ్ఛమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిషేధిత మాదకద్రవ్యాలు విదేశాల నుంచి సముద్ర మార్గంలో దేశ రాజధాని ఢిల్లీకి తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహం పన్నినట్లు అధికారులు గుర్తించారు.
ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి ధాన్యం మొత్తం నీటి పాలైంది. అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిన్న వివాదం కాస్తా పెద్ద గొడవగా మారడంతో జెప్టో డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.