Publish Date:Jun 17, 2026
మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా కాజ లేక్ పార్క్ కు చేరుకున్న మంత్రి లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ లకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీలు తీసుకున్నారు.
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన పర్యావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా కాజ గ్రామంలో ఈస్ట్ లేక్ పార్క్ ను నిర్మించారు. సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేసింది. 17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ ఆధునిక హంగులతో పార్క్‌ను తీర్చిదిద్దారు.
ఇప్పటికే ఉన్న చెరువు కట్టను 1.7 కిలోమీటర్ల మేర బలోపేతం చేశారు. పార్క్‌లో 42 రకాల జాతులకు చెందిన 12 వేల,800 మొక్కలు నాటారు. 1.7 కిలోమీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, భద్రత కోసం ట్రాక్ కు ఇరువైపులా జీఐ చైన్- లింక్ మెష్ ఫెన్సింగ్, ఆధునిక సుందరీకరణ పనులు చేపట్టి పార్క్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-lokesh-inaugurates-east-lake-park-36-223245.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే