కారు దిగిన మంత్రి ఎర్రబెల్లి సోదరుడు.. బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు!

Publish Date:Aug 3, 2022

Advertisement

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన చేరికల కమిటీ తన పని ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి చేరికలు షురూ అయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకీ, శాసనసభ్యత్వానికీ రాజనామా చేశారు. రేపో మాపో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరనున్నారు.

ఇటు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ గూటికి చేర్చుకుంటున్న బీజేపీ  అదే సమయానికి టీఆర్ఎస్ నుంచి కూడా ఓ కీలక నేతకు కమలం కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసింది. ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారు దిగి కాషాయ జెండా ఎత్తడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఏకంగా మంత్రి సోదరుడు టీఆర్ఎస్ రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ నెల 7న ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది.

సరిగ్గా  అదే రోజు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలోనే అమిత్ షా సమక్షంలోనే కమలం గూటికి చేరనున్నారు. కోమటి రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో ఎంత కలకలం రేగిందో, ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా కూడా టీఆర్ఎస్ లో అంతటి కలవరాన్ని కలిగించింది. ప్రదీప్ రావు స్వయంగా ఎర్రబెల్లి సోదరుడు కావడం, పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన రాజీనామా ఒక్క వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సాహించడమే కాకుండా ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఆ చేరికల కమిటీకి టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన ఈటల రాజేందర్ ను చైర్మన్ చేసింది. ఈటలకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో ఉన్న పరిచయంతో ఎక్కువ మందిని కమలం పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయగలరని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో ఇరత పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్న వారి జాబితాను ఇప్పటికే ఈటల అమిత్ షా కు సమర్పించారు. రానున్నరోజులలో కమలం పార్టీలోకి మరింత మంది చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.