ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్ : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 30, 2026

Advertisement

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. 

రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని సీఎం వ్యాఖ్యానించారు. 

ఖనిజాల వ్యాల్యూ అడిషన్ కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏమేరకు ఉన్నాయన్న దానిని గుర్తించాలన్నారు. 

ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని సీఎం అన్నారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా  చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని మిగతా బ్లాక్స్ పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలిచ్చారు. 

టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం

రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాల, సరఫరా పై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఇసుక రీచ్ ల వద్ద  సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించటంతో పాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసమే  ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ సాయి ప్రసాద్, గనుల శాఖ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, పీయుష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది
పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు ఊహించని విధంగా భారీ చుక్కెదురైంది.
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా వరల్డ్ కప్ అనేది ఆటగాళ్ల జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కల.
రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకున్న సాయి–పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆస్పత్రిలో చేరడానికి ముందు మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆయనను రాష్ట్రానికి రెండు ఆడపులలను ఇవ్వాలని కోరారు. అందుకు ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన ఒక ఘోర ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఇటీవల ఓ సందర్భంలో ప్రభుత్వ ప్రజారవాణా బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. ఆ బస్సు ప్రయాణం తరువాత రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకురాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఏపీ సౌకర్యంతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.