బీఆర్ఎస్ కు ఎంఐఎం తలాక్!

Publish Date:Feb 5, 2023

Advertisement

తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఎంఐఎం సహా ఏ పార్టీతోనూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటిరిగానే పోటీ చేసింది. విజయం సాధించింది.

అలాగే ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసి సహా రాష్ట్ర్రంలోని మున్సిపల్, కార్పొరేషనలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అక్కడక్కడ స్థానికంగా పొత్తులు పెట్టుకున్నా. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. ఎంఐఎంతో సహా మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వతా సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసేఆర్ (బీజేపీ, ఎంఐఎం మినహా) అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కడువాలు కప్పి కారు ఎక్కించారు,

 కానీ, ఎన్నికలకు ముందు మాత్రం మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఏ పార్టీతోనూ ప్రత్యక్ష్యంగా పొత్తు పెట్టుకోలేదు. మొదటి సారిగా మునుగోడులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసన సభలో   ఎంఎఐఎం ను  తమ మిత్ర పక్షంగా సగౌరవంగా ప్రకటించారు. విపక్షాలు ముఖ్యంగా బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా, చివరకు రజాకార్ల పార్టీ అన్నా కేసీఆర్ పట్టించుకోలేదు. అవును.. ఎంఐఎం మా మిత్ర పక్షమని కేసీఆర్ ఒకటికి రెందు సార్లు స్పష్తం చేశారు. అంతే కాదు. ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు. కానీ ఇంత వరకూ ఎంఐఎంతో  పొత్తు పెట్టుకునే ఆలోచన మాత్రం చేయలేదు. 

అయితే, ఇప్పుడు మిత్ర పక్షాలు (ఎంఐఎం, బీఆర్ఎస్) మధ్య దూరం పెరిగింది. దూరం పెరగడం కాదు, ఎంఐఎం ఏకంగా బీఆర్ఎస్  కు తలాక్  చెప్పెసిందని అంటున్నారు. ఒక విధంగా ఎంఐఎం  మిత్ర పక్షం బీఆర్ఎస్  కు షాకిచ్చింది. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో, మిత్ర పక్షం అభ్యర్ధన మేరకు  ఎంఐఎం కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి మాత్రం, అల్లుడు అల్లుడే పేకాట పేకాటే అనే విధంగా ఎన్నికల పొత్తు ప్రస్తావన మాత్రం ఇంతవరకు చేయలేదు. మరోవంక, బీఆర్ఎస్‌ కు  ఎంఐఎం తలాక్ చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో శనివారం(ఫిబ్రవరి 4) ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్‌ మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా అదే సంకేతాలు ఇస్తోందని అంటున్నారు.

 అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్, మంత్రులు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వరంటూ మండిపడ్డారు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినే కలుస్తామంటూ ఎద్దేవా చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని.. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి గంటలు గంటలు సమయం ఇవ్వటం సరి కాదన్నారు. శానససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందు అక్బర్‌ బాగానే మాట్లాడేవాడని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదన్నారు.

 కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఎంఐఎంకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కేటీఆర్ చేసిన కామెంట్ కు కౌంటర్ గా వచ్చే ఎన్నికల్లో  ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తాం  అంటూ అక్బరుద్దీన్ ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యమేంటని శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.

ఈ నేపధ్యంలోనేఇప్పటి వరకు మిత్ర పక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం స్నేహబంధం తెగిపోయినట్లేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైందని అంటున్నారు. మరోవైపు బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమే ఈ ప్రకటన అనే చర్చ కూడా జరుగుతోంది. నిజంగానే ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే, ఆపార్టీ 15 సీట్లు గెలుచుకునే విషయం ఎలా ఉన్నా బీఆర్ఎస్ కు ఆమేరకు నష్టం అయితే ఖాయంగా జరుగుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.