తెరాసకు ఎంఐఎం తలాక్ ?

Publish Date:Oct 1, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కేసీఆర్ విజయ దశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే  ఆ రోజున పార్టీ ప్రకటన వరకే ఉంటుందా లేక ఇంకా ఏమైనా సంచలన నిర్ణయాలు ఉంటాయా  అనే విషయంలో ఇంతవరకు అయితే ఎలాంటి స్పష్టత రాలేదు. నిజానికి ఇంతవరకు, జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించి కూడా తెరాస పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  కానీ తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసన సభా పక్షం, విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందనే సమాచారం అయితే  ఉందని అంటున్నారు. అయితే, పండగ పూట జరిగే సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనతో పాటుగా తెరాస పార్టీ  పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. 

అయితే  అది ఎలా ఉన్నప్పటికీ, కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా తెరాస ఏకైక మిత్రపక్షం  ఎంఐఎం గులాబీ పార్టీకి తలాక్  చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ముందు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ మలి విడత ఉద్యమాన్నీ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజ జరిగితే  బీజేపీ బలపడుతుందని  ఎంఐఎం అధ్యక్షుడు  హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్  లోపలా వెలుపలా కూడా పలు సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించారు. 

అయితే  రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్, ఒవైసీ జిగ్నీదోస్తులై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదిక నుంచే, ‘అవును. ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసినా, ఫలితాలు వచ్చిన తర్వాత  ఒకటై పోయారు. చివరకు మొన్నటికి మొన్న  సెప్టెంబర్ 17న  అనివార్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపవలసి వచ్చినప్పుడు కూడా  తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన దినంగా కాకుండా ఒవైసీ సూచించిన విధంగా జాతీయ సమైక్యతా దినంగా జరిపించారు. 

అయినా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలున్నా ఇప్పటికే జాతీయ రాజకీయాలలో వేలు పెట్టిన ఎంఐఎం అధినేత ఒవైసీకి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టడం ఏమాత్రం  ఇష్టం లేదని అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  కేసీఆర్  తప్పుడు రాజకీయ ఎత్తుగడల వల్లనే, రాష్ట్రంలో బీజేపీ బలం పుంజు కుంటోందని ఒవైసీ గుస్సా అవుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో కాషాయ దళం అధికారంలోకి వచ్చే ప్రమాదకర పరిస్థితులను కూడా కేసీఆర్ సృష్టిస్తున్నారని  ఒవైసీ  భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

తెరాసతో ఉన్న రాజకీయ అవగాహన కారణంగా  ఎంఐఎం ఇంతవరకూ పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ,  హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెరాసకు తలాక్ చెప్పిన నేపధ్యంలో రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికగా ఉన్న ఇతర జిల్లాలు, నియోజక వర్గాల నుంచి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంఐఎం కేవలం పాత బస్తీకే పరిమితమైతే  పాత బస్తీ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా, బీజేపీ మోడీ ప్రభుత్వ సహకారంతో తమ గొంతు నొక్కేస్తుందని,  అదే ఓ 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే, తెలంగాణలో యూపీ ( యోగీ) బుల్దోజర్ పాలనను అడ్డుకోగలుగుతామని ఒవైసీ భావిస్తున్నారని తెలుస్తోంది. 

ఈ నేపధ్యంలోనే ఉమ్మడి అధిలాబాద్, నిజాబాబాద్, కరీంనగర్ జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం నాయకత్వం నిర్ణయానికి వచ్చి నట్లు తెసుస్తోంది. నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ మున్సిపాలిటీలలో ఎంఐఎం ఇప్పటికే ఒకటీ అరా సీట్లు గెలుచుకుంది.  అలాగే, ఓబీసీలు, దళితులను కలుపుకుని రాష్ట్రంలో విస్తరించే, ప్రణాళికకు ఒవైసీ పదును పెడుతున్నారు. అలాగే  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎంఐఎం కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు.  అందుకే ఎంఐఎం తెరాసతో తలాక్ కు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎంతో తెరాస దోస్తానాను బూచిగా చూపించి  హిందూ ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకునేందుకు, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేసీఆర్, ఒవైసీ ‘తలాక్’ వ్యూహాన్ని తెర  మీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.