అరటిపండును పాలతో కలిపి తింటే ఈ నష్టాలు తప్పవట..!

Publish Date:Sep 13, 2025

Advertisement


అరటిపండు.. అందరికి సులువుగా దొరికే పండు. సీజన్ తో సంబంధం లేకుండా అరటిపండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. అరటిపండ్లు చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సులువుగా తినడానికి అనువుగా ఉంటాయి. చాలామంది అరటిపండును ఉదయాన్నే అల్పాహారంగానో లేదా ఉదయం తీసుకునే ప్రోటీన్ డ్రింక్స్ లోనూ వాడుతుంటారు. ముఖ్యంగా అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం చాలా మంది అలవాటు.  మిల్క్ షేక్ అయితే ఎడాపెడా తాగేస్తారు. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

జీర్ణసమస్యలు..

అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.  ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు రెండూ బరువుగా ఉండే పదార్థాలు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.  ఉబ్బరం,  గ్యాస్ లేదా మలబద్దకానికి కారణం అవుతుంది.

కఫం..

అరటిపండు, పాలు రెండింటిని కలిపి తీసుకుంటే కఫం ఏర్పడుతుందట.  ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదని అంటున్నారు. కఫ శరీరం ఉన్నవారు ఈ కాంబినేషన్ ను అస్సలు ట్రై చేయకపోవడమే మంచిది.  కఫం పెరిగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.

అలెర్జీలు, సైనస్..

అరటిపండు, పాలు కాంబినేషన్ కొంతమందికి అలెర్జీలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. శరీరంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.  ఇది మాత్రమే కాకుండా సైనస్ రద్దీని ఈ కాంబినేషన్ పెంచుతుందట.  ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు.

నీరసం..

పాలు, అరటిపండు రెండూ శక్తివంతమైనవే.. ఇవి రెండూ శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం భారంగా మారుతుందని, ఇది నీరసం ఫీలింగ్ పెంచుతుందని అంటున్నారు. ఒళ్లంతా భారంగా అనిపించడం వల్ల బాగా నీరసంగా అనిపిస్తుందని కొందరు అనుభవాల ద్వారా పంచుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు.

రక్తంలో చక్కెర..

అరటిపండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది.  ఇక పాలలో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేటికాలంలో  డయాబెటిస్ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా.. ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండటం మంచిది.


                                 *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.