మైక్రో ఫైనాన్స్ వివాదం: మరో వీడియో విడుదల చేసిన సింగర్ మంగ్లీ
Publish Date:Apr 16, 2026
Advertisement
మైక్రో ఫైనాన్స్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయని మంగ్లీ మరో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఇమె మైక్రో ఫైనాన్స్ అన్న పదమే తనకు తెలియదని పేర్కొన్నారు. తనపై ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ.. సీపీ సజ్జనార్ తో పాటు, డిజిపి కి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగామరో వీడియో విడుదల చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో పునరుద్ఘాటించారు. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానన్న మంగ్లీ, ఈ ఫైనాన్స్ చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదానికి తనకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కమ్యూనిటీ కార్యక్రమంలో మాత్రమే రామావత్ మధును కలిసినట్లు చెప్పారు. తన తమ్ముడు శివ పేరు కూడా ఈ వివాదం లో లాగడం బాధాకరమని మంగ్లీ పేర్కొన్నారు. చీటింగ్ వ్యవహారంలో తన పేరును వాడుతున్నాడని తెలిసిన వెంటనే మధుపై ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా బాధితురాలినేనని చెప్పుకున్నారు. . డబ్బులు ఇచ్చి బాధితులు మోసపోతే అకారణంగా తనపై బురద చల్లి ఇబ్బందు లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/microfinance-controversy-36-217485.html





