ఆడవారి ఈ అలవాట్లు మగాళ్ల మనసును కొల్లగొడతాయట..!

Publish Date:Sep 23, 2025

Advertisement

 


ఆకర్షణ అనేది చాలా విచిత్రమైనది.  ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే.. మనుషులకు కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఏ పిచ్చి  ఆకర్షణలకు లోను కాకుండా ఉంటారు.  ఈ కాలంలో అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా తమకు ఎవరైనా నచ్చితే ఎదుటివారు  కూడా తమను ఇష్టపడాలి అనుకుంటారు.  ముఖ్యంగా ఏ అమ్మాయి అయినా తమకు నచ్చిన అబ్బాయిని అట్రాక్ట్ చేయాలనుకుంటే కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయి.  వారు కొన్ని అలవాట్లను ఫాలో అయితే చాలు.. అలాంటి అమ్మాయిలను చూసి అబ్బాయిల మనసు ఫ్లాట్ అవుతుందట. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

 స్వావలంబన..

నేటి ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. పురుషులు అలాంటి మహిళలను ఎంతో ఇష్టపడతారు. ఒక స్త్రీ తన సొంత నిర్ణయాలు తీసుకుని, స్వావలంబన కలిగి ఉన్నప్పుడు అది ఆమె వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.  

సానుకూల ఆలోచన..

కష్ట సమయాల్లో కూడా సానుకూలంగా ఆలోచించే   మహిళల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు. సానుకూల దృక్పథం ఉన్న మహిళలు ప్రతి పరిస్థితిని అవగాహనతో డీల్ చేస్తారు. అలాంటి మహిళలు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు.  కష్ట సమయాల్లో తమ భాగస్వాముల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.  

గౌరవం..

గౌరవం, ప్రేమ ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అట్లాగే  ఇతరులను,  ఇతరుల   అభిప్రాయాలను కూడా గౌరవించాలని కోరుకుంటాడు. ఒక స్త్రీ తన భాగస్వామి భావాలను,  అభిప్రాయాలను గౌరవించినప్పుడు అది సంబంధం బలంగా మారడానికి దోహదమవుతుంది.

ఆనందం..

నేటి బిజీ జీవితాల్లో ఒక స్త్రీ చిన్న విషయాలలో ఆనందాన్ని అనుభూతి చెందితే.. అలాంటి మహిళలకు అబ్బాయిలు చాలా  ఆకర్షితులు అవుతారు. చిన్న చిన్న విషయాలకే చిరాకు చూపే స్త్రీల వల్ల  సంబంధాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది.

నిజాయితీ..

ప్రతి సంబంధంలోనూ నిజాయితీ చాలా కీలకం. ఒక స్త్రీ తన సంబంధంలో నిజాయితీగా ఉంటే, పురుషులు ఆమెను ఎంతో గౌరవిస్తారు. మహిళలలో ఉండే ఈ అలవాటు ఆమె పట్ల వారికి గౌరవాన్ని మరింత పెంచుతుంది.  

సెల్ఫ్ లవ్..

 పురుషులు తమను తాము ప్రేమించుకుంటూ తమ గురించి తాము  శ్రద్ధ వహించే స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. తమను తాము గౌరవించుకునే స్త్రీలను ఇతరులు కూడా గౌరవిస్తారు.  

పై అలవాట్లు అమ్మాయిలలో ఉంటే వారు అబ్బాయిలకు చాలా నచ్చుతారు. ఇలాంటి అమ్మాయిలు లైఫ్ ను చాలా బాగా లీడ్ చేయగలుగుతారు.  పరిస్థితులను చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు.


                            *రూపశ్రీ.

By
en-us Political News

  
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.