జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ హీరో చిరంజీవికి కారు చౌకగా 595 గజాల స్థలాన్ని కట్టబెట్టిన కుంభకోణం వెనుక ఉన్న పెద్దల పాత్రపై రోజుకో పేరు తెరపైకి వస్తోంది. కుంభకోణం వెనుక పెద్దల హస్తంపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ గత 20 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ఆ దర్యాప్తు ప్రారంభం కాకుండానే మరో భూ బాగోతం వెలుగులోనికి వచ్చింది. మెగా హీరోకు ‘చిరు’ ధరకే సొసైటీకి చెందని స్థలాన్ని, అదీ ప్రభుత్వ భూమిని సొసౌటీ ఉదారంగా విక్రయించేసిన వైనం కలకలం రేపుతోంది. వివరాలలోకి వెడితే.. చిరంజీవి గతంలో సొసైటీలోనే కొనుగోలు చేసిన స్థలం (ప్లాట్ నం.303 ఎన్)కు ఆనుకుని 595 గజాల స్థలం ఉంది. అయితే అది సొసైటీకి చెందిన స్థలం కాదు. సొసైటీ లే ఔట్ లో కూడా లేదు. అయినా కూడా సొసైటీ దానిని మెగాస్టార్ చిరంజీవికి గత అమ్మేసింది. గత నెల 20న రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అదీ అలా ఇలా కాదు కారు చౌకగా... బహిరంగ మార్కెట్ లో ఈ భూమి గజం విలువ నాలుగు లక్షల వరకూ ఉంది. అంటే సొసైటీ చిరంజీవికి అమ్మేసిన 595 గజాల స్థలం విలువ రమారమి 24 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని సొసైటీ మెగాస్టార్ చిరంజీవికి గజం 64 వేల చొప్పున కేవలం 3.80 కోట్ల రూపాయలకే విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసింది. సొసైటీ గత అక్రమాలపై ప్రభుత్వం విచారణకు సన్నద్ధమౌతుండగా కొత్తగా తెరపైకి వచ్చిన ఈ భూ బాగోతం సంచలనం సృష్టించింది. పైగా ఈ బాగోతంలో చిరంజీవి భాగస్వామి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
గత పాలక మండలి అక్రమాలపై ఫిర్యాదు చేసిన ప్రస్తుత పాలక మండలే నిబంధనలకు గాలికొదిలేసి ‘చిరు’ ధరకు కోట్లాది రూపాలయలు విలువ చేసే భూమిని మెగా స్టార్ కు ధారాదత్తం చేయడం వెనుక పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ భూ దందాపై ఇప్పటికే సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పుడు కారు చౌకగా మెగాస్టార్ చిరంజీవికి సొసైటీ ‘చిరు’ ధరకే కట్ట బెట్టిన 595 చదరపు గజాల స్థలం చిరంజీవికి ఇప్పటికే సొసైటీలో ఉన్న 3333 చదరపు గజాల ప్లాట్ కు ఆనుకునే ఉంది. అయితే చిరంజీవి ఇప్పుడు సొసైటీ నుంచి కొనుగోలు చేసిన 595 చదరపు గజాల స్థలం అసలు సొసైటీ స్థలమే కాదు. అయినా సొసైటీ దర్జాగా దానికి మెగాస్టార్ కు విక్రయించేసింది. ఈ బాగోతం బైట పడటంతో ప్రస్తుత సొసైటీ అది తమ తప్పు కాదు..పాత గవర్నింగ్ బాడీయే అప్రూవల్ చేసిందని చెప్పుకొస్తున్నది. అయితే గత సొసైటీ తప్పిదమైతే ప్రస్తుత సొసైటీ దానిని రద్దు చేసే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది.
గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలపై ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తుతుంటే...వాటిపై విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కూడా కొత్తగా మరో కుంభకోణం చోటు చేసుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అంటున్నారు. ఇక చిరంజీవికి ఈ భూమి సొసైటీది కాదని తెలియక కొన్నారని కొందరు చేస్తున్న వాదన సబబుగా లేదు. తాను కొత్తగా కొన్న 595 చదరపు అడుగుల భూమి, తనకు ఇప్పటికే సొసైటీలో ఉన్న స్థలానికి ఆనుకునే ఉంది. ఆ భూమిని ఆయన 1999లోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్ 20న ఈ తాజా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంత కాలం తన స్థలానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం సొసైటీదో కాదా ఆయనకు తెలియదంటే నమ్మశక్యం కాదని సొసైటీ సభ్యులు అంటున్నారు. అన్నీ, అందరికీ తెలిసే ఈ అక్రమ భూ బాగోతం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mega-land-scam-in--jublee--hills-housing-socity-39-135342.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.