మెగా డీఎస్సీ 2026 నోటీఫికేషన్ ఎప్పుడంటే?

Publish Date:Jun 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ అభ్యర్థులకు, నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ 2026  నోటిఫికేషన్‌పై అధికారిక ప్రకటన చేసింది.  రాష్ట్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా.. ఈ ఏడాది అక్టోబర్ లో  మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, నియామక రాత పరీక్షలను కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  అమరావతిలోని సచివాలయంలో జరిగిన  గురువారం (జూన్ 11) ఏర్పాటు చేసిన మీడియా సమావేంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ వివరాలను  వెల్లడించారు.

అలాగే..  డీఎస్సీ 2025 నియామకాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న పలు ఆరోపణలపై  స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియా వేదికగా హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా నియామకాలు, అలాగే దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలను  వారు ఖండించారు.  ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అంతా కూడా   నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శకంగా జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విస్పష్టంగా చెప్పారు.  

ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అంతా పూర్తి డిజిటల్ రూపంలోనే సాగిందని, అందువల్ల పేపర్ లీకేజీలకు ,  అవకతవకలకు  ఇసుమంతైనా ఆస్కారం లేదన్నారు.   అలాగే..  స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై క్రీడాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న   నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ  పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ జీవో ప్రకారం.. నేషనల్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్‌షిప్స్, ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ పోటీలు, సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ ఈవెంట్స్, స్టేట్ ఛాంపియన్‌షిప్స్,  అంతర్జాతీయ పోటీలలో సాధించిన సాధికారిక విజయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ఈ క్రమంలో 34 రకాల విభిన్న క్రీడా విభాగాల నుండి మొత్తం 382 మంది అభ్యర్థులను స్పోర్ట్స్ కోటా కింద క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సింగిల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్‌ను అర్హత నిర్ధారించడానికి ముందు మల్టీ-లెవెల్ వెరిఫికేషన్  చేశామరి అజయ్ జైన్ వివరించారు.  రాష్ట్ర యువతలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూనే, నియామకాల్లో నిష్పాక్షికతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 

By
en-us Political News

  
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్ FDE ఉద్యోగాల డిమాండ్, రూ. 1.4 కోట్ల భారీ జీతాల ప్యాకేజీలు మరియు AI అమలులో వీటి ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.