చిరు ఇమేజ్‌కి మెగా డ్యామేజ్‌..

Publish Date:Jan 16, 2022

Advertisement

మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలనుంచి తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్య  సభ టికెట్ ఆఫర్ చేశారని, అందుకు తాను అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని.. తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోబోనని తేల్చి చెప్పారు. రాజ్యసభ సీటుపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చిరంజీవి కుండబద్ధలు కొట్టేశారు.ఆయినా, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒంటరిగా భేటీ అవడం వెనక ఏదో ఉందనే వ్యూహగానాలు రాజకీయ, సినిమా వర్గాల్లో ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో చిరంజీవితో సన్నిహిత సంబంధం ఉన్న ఎవరిని కదిల్చినా, నిప్పు లేనిదే పొగరాదనే సామెతనే గుర్తు చేస్తున్నారు. అంటే, చిరంజీవి ఖండనను నమ్మేందుకు సినీ, రాజకీయ జనాలు సిద్ధంగా లేరని తెలుస్తోంది.  

నిజానికి, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినవస్తూనే ఉంది. ఒక దశలో ఆయన పేరు ఏపీ-పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్త లొచ్చాయి.  అదే సమయంలో ఏఐసీసీ - ఏపీ వ్యవహారాల ఇంచార్జి, ఒమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్పార్టీలోనే లేరని అనడం , అందుకు పీసీసీ ఆయన కాంగ్రెస్’లోనే ఉన్నారని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా, అప్పట్లో చిరంజీవి పెదవి విప్పలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననో లేననో  చెప్పలేదు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారే కానీ, అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామచేయలేదు. కనీసం అలాంటి ప్రకటన ఏది రాలేదు.   

అంతేకాదు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కానీ, రాజకీయలాకు పూర్తిగా దూరంగా లేరు. ఒక విధంగా వైసీపీ దగ్గరవుతున్నసంకేతాలు కూడా  ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిత విధానానికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి బహిరంగంగానే సమర్ధించారు. ఒక విధంగా, వైసీపీ నయకులు , అభిమానులకంటే ఎక్కువగా జగన్ రెడ్డి వినిపించిన వికేంద్రీకరణ వాదాన్ని సమర్ధించారు. జగన్ రెడ్డి మాటే చిరంజీఉ పలుకుగా వినిపించారు. 

అలాగే, కొవిడ్ వాక్సినేషన్ విషయంలోనూ జగన్ రెడ్డిని అభినందనలలో ముంచెత్తారు. దేశంలో చాల రాష్ట్రలలో ఒకే రోజున రికార్డు స్థయిలో కోవిడ్ తెకాలు వేశారు. అయితే అదేదో ఒక్క ఏపీలోనే జరిగినట్లు, అందుకు జగన్ రెడ్డి ‘విజన్’ కారణమని చిరంజీవి, మళ్ళీ వైసీపీ నేతలను మించి జగన్ రెడ్డిని అభినందించారు.  అంతే కాదు, అదే సమయంలో చిరంజీవి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారని,  వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్ళే పనిలో ఉన్నారని వచ్చిన వార్తలను ఆయన గానీ,ఆ ఆయన తరపున ఇంకొకరు గానీ, ఖండించలేదు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చిరంజీవివేలు పెట్టారు. ఇటు మూడు రాజదానుల ధుల విషయంలో అయితే నేమీ, స్టీల్ ప్లాంట్ వ్యవహాంలో అయితే నేమీ, చిరంజీవి, వైసీపీ స్టాండ్’నే వినిపించారు. సో .. జగన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని అంటే కాదనేందుకు కారణం కనిపించదు.

అదేగాక, చిరంజీవి రాజకీయ ప్రస్థానం గమనిస్తే, ఆయనకు రాజకీయ నిబద్దత ఉందని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో తెలుగు దేశం పార్టీని ఓడించేందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించెందుకే ఆయన వైఎస్సార్ ‘చే’యూతతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయినా ప్రజలు, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, సినిమా అభిమానులు ఆయనకు బ్రహ్మరధం పట్టారు. నిజానికి, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోవచ్చును, కానీ, గణనీయ విజయాన్నే సాధించింది. 

ఓ వంక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరో వంక రాష్ట్రంలో వేళ్ళూనిన టీడీపీ, తెరాస, వామ పక్షాలలో కూడిన మహా కూటమి పోటీని ఎదుర్కుని, అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం 71 లక్షల పై చిలుకు ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయినా, చిరంజీవి లక్షల మంది ఆశలను వమ్ము చేస్తూ,కేవలం కేంద్రంలో సహాయ  మంత్రి పదవికోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేశారు. కాంగ్రెస్ ఓపోయిన తర్వతా సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గంగలో వదిలేసి,టాలీవుడ్ తెరకు చేరుకున్నారు. సో .. ఇప్పుడు మళ్ళీ, సంక్షోభంలో ఉన్న సినిమా రంగాన్ని అదే గంగలో ముంచేసి మళ్ళీ రాజకీయ పునరావాసం వెతుక్కుంటున్నారు, అనే అభియోగంలో నిజం లేదని అనలేమని విశ్లేషకులు అంటున్నారు.  

అయితే, చిరంజీవి బలహీనతను జగన్ రెడ్డి ఉపయోగించుకుని, వ్యూహత్మకంగానే ఆయన్ని చర్చలకు పిలిచి చిక్కుల్లోకి నెట్టి, అభాసుపలు చేశారని ...అయితే, జగన్ రెడ్డి అన్నంతో పాటుగా వడ్డించిన మరకలు చిరంజీవిని వెంటాడుతూనే ఉంటాయని అంటున్నారు. అయితే అందుకు ఎవరూ చింతించ వలసిన అవసరం లేదు .. నో .. రిగ్రీట్స్ అనికూడా పరిశీలకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.