Publish Date:Aug 28, 2024
మెగా వర్సెస్ అల్లు వార్ ముదిరి పాకాన పడింది. ఇంత వరకూ రెండు కుటుంబాలకు చెందిన వారి మధ్య మాత్రమే నడిచిన మాటలయుద్ధం ఇప్పుుడు రాజకీయ వేదికలకూ పాకింది. అసలిదంతా ఎలా మొదలైందంటే.. ఎన్నికలకు ముందు వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి, ర్యాలీలో పాల్గొనడంతో ఆరంభమైంది. అప్పటి నుంచీ అల్లు అర్జున్ పై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉంది. మెగా అభిమానులు బన్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది.
నాగబాబు సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ పరోక్షంగా పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ.. ఇటీవల ఓ ఈవెంట్ లో నా ఫ్యాన్స్ అని నొక్కి చెప్పాడు. అలాగే నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తానంటూ తన నంద్యాల టూర్ ని సమర్ధించుకున్నాడు. దీంతో బన్నీపై మెగా అభిమానుల విమర్శలు మరింత పెరిగాయి. ఇలా రోజురోజుకి వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కదా.. దీనిపై మీ స్పందన ఏంటని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొలిశెట్టి శ్రీనివాస్ అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలియదు అంటూ బదులిచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా విడిపోయి షామియానా కంపెనీలాగా బ్రాంచ్ పెట్టుకున్నారేమో అని వ్యాఖ్యానించారు. అలాగే ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదు. బహుశా అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో అన్న బోలిశెట్టి శ్రీనివాస్ ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానులే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా ఇష్టమైతే వస్తా అన్న అల్లు అర్జున్ మాటలను ఉటంకిస్తూ అసలు ఆయనను రమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఒకటే అన్న బోలిశెట్టి, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేసిన చోట వాళ్లు ఓడిపోయారన్నారు. అంతెందుకు అల్లు అర్జున్ తండ్రి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వెళ్లి ఏం చేశారని ఎద్దేవా చేశారు. దీంతో ఇప్పుడు బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అల్లు ఫ్యామిలీ వార్ ఇప్పుడు మరంత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mega-and-allu-war-intensify-25-183756.html
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.