అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడున్నారు?.. జనసేన ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

Publish Date:Aug 28, 2024

Advertisement

మెగా వర్సెస్ అల్లు వార్ ముదిరి పాకాన పడింది. ఇంత వరకూ రెండు కుటుంబాలకు చెందిన వారి మధ్య మాత్రమే నడిచిన మాటలయుద్ధం ఇప్పుుడు రాజకీయ వేదికలకూ పాకింది. అసలిదంతా ఎలా మొదలైందంటే.. ఎన్నికలకు ముందు  వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి, ర్యాలీలో పాల్గొనడంతో ఆరంభమైంది. అప్పటి నుంచీ   అల్లు అర్జున్  పై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉంది. మెగా అభిమానులు బన్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది.

నాగబాబు సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ పరోక్షంగా పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ.. ఇటీవల ఓ ఈవెంట్ లో నా ఫ్యాన్స్ అని నొక్కి చెప్పాడు. అలాగే నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తానంటూ తన నంద్యాల టూర్ ని సమర్ధించుకున్నాడు.  దీంతో బన్నీపై మెగా అభిమానుల విమర్శలు మరింత పెరిగాయి. ఇలా రోజురోజుకి వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కదా.. దీనిపై మీ స్పందన ఏంటని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొలిశెట్టి శ్రీనివాస్ అసలు అల్లు అర్జున్  కు ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలియదు అంటూ బదులిచ్చారు.  మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా విడిపోయి షామియానా కంపెనీలాగా బ్రాంచ్ పెట్టుకున్నారేమో అని వ్యాఖ్యానించారు. అలాగే ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదు. బహుశా అల్లు అర్జున్  తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో అన్న బోలిశెట్టి శ్రీనివాస్ ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానులే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు.  నా ఇష్టమైతే వస్తా అన్న అల్లు అర్జున్ మాటలను ఉటంకిస్తూ అసలు ఆయనను రమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఒకటే అన్న బోలిశెట్టి,   జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేసిన చోట వాళ్లు ఓడిపోయారన్నారు. అంతెందుకు అల్లు అర్జున్ తండ్రి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వెళ్లి ఏం చేశారని ఎద్దేవా చేశారు. దీంతో ఇప్పుడు బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అల్లు ఫ్యామిలీ వార్ ఇప్పుడు మరంత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.