పారాసిటమాల్, మల్టీ విటమిన్ మ‌రింత కాస్ట్లీ.. భారీగా పెర‌గ‌నున్న మందుల ధరలు

Publish Date:Mar 26, 2022

Advertisement

జ్వ‌రం వ‌స్తే పారాసిట‌మాల్‌. క‌రోనా వ‌చ్చినా అదే మెడిసిన్‌. అందులో డోలో 650కి మ‌రింత డిమాండ్‌. ఇక కొవిడ్ కాలం నుంచి జింక్‌, మ‌ల్టీ విట‌మిన్‌ ట్యాబ్లెట్స్ వినియోగం భారీగా పెరిగింది. క‌రోనా లేకున్నా జింకోవిట్‌, విట‌మిన్-సి, విట‌మిన్-డి ట్యాబ్లెట్లు రోజూవారీగా వాడుతున్నారు చాలామంది. యాంటీబాటిక్స్ సైతం చాక్లెట్ల‌లా చ‌ప్ప‌రించేస్తున్నారు. ఇవి కాక‌, బీపీ, షుగ‌ర్‌, అల‌ర్జీ, హార్ట్‌ ట్యాబ్లెట్స్ వాడేవారు కోకొల్ల‌లు. వీరంద‌రికీ ఇప్పుడో షాకింగ్ న్యూస్‌. ఏప్రిల్ 1 నుంచి మందుల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయి. ఏకంగా 10 శాతం కంటే ఎక్కువే రేటు పెర‌గ‌నుంది. అందులో అధిక శాతం అత్య‌వ‌స‌ర ఔష‌ధాల జాబితాలో ఉన్న‌వే. మ‌రి, డిమాండ్ పెరిగింద‌నో, రా మెటీరియ‌ల్ షార్టేజో.. కార‌ణం ఏదైనా ఇక‌పై అనేక మందులు బాగా ఖ‌రీదు కానున్నాయి.

ఓ వైపు నిత్యావసరాలు.. మరోవైపు గ్యాస్‌, చమురు, క‌రెంట్‌ ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈసారి మందుల‌ భారం కూడా పడనుంది. జ్వరం, ఇన్ఫెక్షన్‌, బీపీ వంటి వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్‌ నుంచి పెరగనున్నాయి. వీటి ధరలు 10.8శాతం పెరగనున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ-NPPA ఓ ప్రకటనలో వెల్లడించింది. 

అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్‌ మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి 10.8శాతం పెరగనున్నాయి. జ్వరం, ఇన్ఫెక్షన్‌, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ పెరుగుతాయి. ఇందులో పారాసెటమాల్‌, ఫెనోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, అజిత్రోమైసిన్‌, సిప్రోఫ్లోక్సాసిన్‌ హైడ్రోక్లోరైడ్‌, మెట్రోనిడజోల్‌ వంటి ఔషధాలున్నాయి. విటమిన్స్‌, మినరల్స్‌ ధరలు కూడా కాస్ట్లీ కానున్నాయి. కొవిడ్‌ బాధితులు వాడే మందుల ధ‌ర‌లూ అధికం కానున్నాయి. కొవిడ్ పాండ‌మిక్‌ కారణంగా తయారీ ఖర్చులు పెరగడంతో ఔషధాల ధరలను పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తుండ‌గా.. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంద‌ని తెలుస్తోంది.  

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.