మావి‘గన్’ పేలదు.. డీవీ శ్రీనివాస్ విశ్లేషణ

Publish Date:Apr 4, 2026

Advertisement

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం  కేంద్ర బిందువుగా మారింది. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన  మావిగన్  కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ డి.వి. శ్రీనివాస్ విశ్లేషణ ప్రకారం, జగన్ వ్యూహం వెనుక కేవలం రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది. 

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్..  ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల సమస్యలను విస్మరించిన జగన్.. ఇప్పుడు అకస్మాత్తుగా శేషగిరమ్మ వంటి వృద్ధులను కలవడం విమర్శలకు తావిస్తోంది. 

జగన్ అకస్మాత్తుగా రైతుల పక్షపాతిగా మారడం వెనుక ఒక వ్యూహం ఉందని సీనియర్ జర్నలిస్ట్ డీవీశ్రీనివాస్ అంటున్నారు.  అమరావతి ప్రాంతంలో కోల్పోయిన ఓటు బ్యాంకును, కనీసం ఈ మావిగన్  ప్రాంతంలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే..  గతంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరని, మరచిపోరనీ డీవీ శ్రీనివాస్ చెబుతున్నారు.  అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడమే వైసీపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారాయన.

అమెరికాలో ఒక పోలీసు అధికారి బూటు కాలితో తొక్కడం ఎలాగైతే ఒక ప్రభుత్వం పతనానికి దారితీసిందో, ఏపీలో కూడా రైతు కుటుంబాల పట్ల జరిగిన దుశ్చర్యలే గత ఎన్నికలలో జగన్ ఓటమికి ప్రధాన కారణమని గుర్తు చేసిన డీవీ శ్రీనివాస్.. ఇప్పుడు  మావిగన్ పేరుతో ముందుకు రావడం అనేది కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, వాస్తవిక అభివృద్ధికి సంబంధించినది కాదని ఆయన చెప్పారు.  

రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం వేగవంతమైతే, జగన్ ప్రతిపాదించిన  మావిగన్ మంత్రం ఫలించే అవకాశమే లేదన్నారాయన. ప్రభుత్వం మానవీయ కోణంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తే..  జగన్ ఆరోపణలకు బలం ఉండదు. ఒకవేళ వైసీపీ తన మొండి వైఖరిని వీడకుండా, కేవలం విమర్శలకే పరిమితమైతే, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో కూడా ఆ పార్టీకి ఉన్న అంతంత మాత్రం పట్టు కూడా సడిలిపోతుందని అన్నారు డీవీ శ్రీనివాస్.  రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని చెప్పారు. 

 

 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.