వైసీపీలో మావిగన్ చిచ్చు.. జగన్ పై లీడర్, క్యాడర్ గుర్రు

Publish Date:May 7, 2026

Advertisement

వైసీపీలో ప్రస్తుతం ‘మావిగన్’ చిచ్చు రేపుతోంది. అమరావతికి బదులుగా రాష్ట్ర రాజధానిగా మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటన వైసీపీలో నిట్టనిలువుగా చీలిక వచ్చేలా కనిపిస్తోందన్న అభిప్రాయం పరిశీలకులనుంచి వ్యక్తం అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ జగన్ చేసిన ప్రతిపాదన ప్రకంపనలు పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అంతకు మించి నష్టం చేరుస్తుందని అంతర్గత సంభాషణల్లో గట్టిగా  చెబుతున్నారు.  

ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన సోదరులు మావిగన్ తో విభేదిస్తున్నారు. జగన్ ప్రతిపాదనపై వారిరువురూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. జగన్ ఎవరితో చర్చించి మావిగన్ అన్నారని వారు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.  ధర్మాన ప్రసాదరావు అయితే మావిగన్ విషయంలో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో అయితే.. మావిగన్ పై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత కూడా మావిగన్ ప్రకటనను తప్పుపట్టారు. పార్టీలో సీనియర్లతో కనీసం చర్చించకుండా జగన్ చేసిన ప్రకటేన సరికాదన్నారు.  సీనియర్లతో చర్చించాలన్న ఆలోచన కూడా జగన్ చేయకపోతే.. ఇక తాము పార్టీలో ఉండి ప్రయోజనమేంటన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.