తిట్టినా తుడిచేసుకోవడమేనా? ఆంద్రుల ఆత్మగౌరవం అంతేనా?

Publish Date:Feb 3, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, భాష గురించి చర్చ అనవసరం. అది ఆయన విజ్ఞత, వివేచనకు సంబందించిన విషయం.కానీ,ఆయన మాట్లాడుతున్న భాష తెరాస నాయకులకే రుచించడం లేదు. చివరకు, తెరాస రాజ్యసభ సభ్యుడు, కే. కేశవ రావు కూడా, కేసీఆర్ భాషను కాదు భావాన్ని మాత్రమే తీసుకోవాలి అన్నారు,అంటే కేసీఆర్ భాష అభ్యంతరకరంగా , అసభ్యంగా ఉందని ఆయన కూడా భావిస్తున్నారని అనుకోవచ్చును. 

సరే, అదలా ఉంటే, కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీలనే కాదు, పొరుగు రాష్ట్రం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని వదిలి పెట్టలేదు. నిజానికి, కేసీఆర్ వైసీపీని, వైసీపీ ప్రభుత్వాన్నే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా అవమానించారు. చిత్రం ఏమంటే, కేసీఆర్ తమపై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధీటుగా స్పందించారు, కానీ, వైసీపీ నాయకులు పెదవి విప్పలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఏపీకి తెలంగాణ సరసన నిలిచే అర్హతే లేదని చులకన చేసి మాట్లాడినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో చలనం లేదు. వైసీపీలో కదలిక లేదు. అంతే కాదు, గుడివాడ కాసినో వ్యవహరాన్ని, గంజాయి అక్రమ  రవాణాకు సంబందించి ఇటీవల వెలుగులోకి వచ్చిన వార్తలను దృషిలో ఉంచుకుని కావచ్చును,  ఏపీలో క్లబ్‌లు, గంజాయి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి అని అర్థం వచ్చే విధంగా కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలుచేశారు. అలాగే, చెప్పీచెప్పకుండానే ఏపీలో ఇళ్ళ నిర్మాణానికి  గజానికింత అని (జే’ టాక్స్)  వసూలు చేస్తున్నారని, విమర్శలు గుప్పించారు. నిజానికి, తెరాస నాయకులు ఇలా ఏపీని చులకన చేసి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మరి కొందరు కూడా రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పుల మీదనే మనగడ సాగిస్తోందని, అప్పు లేనిదే పూట గడవదని అన్నారు. 

అయినా, అప్పుడే కాదు, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను అవమానించే వ్యాఖ్యలు చేసినా, వైసీపీ నేతలు ఎవరూ కేసీఆర్ వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. ఖండించక పోవడమే కాదు, రాజ్యాంగాన్ని, రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ను అవమన పరిచే విధంగా రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ కేసీఆర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను  వైసీపీ నేతలు సమర్ధించారు. కేసీఆర్’కు ఆయన భాషలోనే చెప్పాపంటే, ‘సిగ్గు లేకుండా’ జై కొట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, మేథావులు ఆందోళన చేస్తున్నా, అదేమీ పట్టనట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి సమర్ధించారు. కేసీఆర్ మాటల్లో తప్పేమీ లేదని రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నాయని సజ్జల ప్రకటించారు. కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు సమంజసమేనని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అంటే, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచినా, రాజ్యాంగాన్ని,రాజ్యాంగ నిర్మాతను అవమానించినా, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు. కేసీఆర్’తో జగన్ రెడ్డికి ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటీ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

అలాగే, అటు కేంద్ర ప్రభుత్వం  బడ్జెట్’లో  రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినా, ముఖ్యమంత్రి స్పందించరు. చివరకు అన్నీ తెలిసిన, సర్వం తానైన’ సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆ ఒక్కటి నన్ను అడగద్దని  తప్పించుకుంటారు. ఆర్థిక మంత్రి బుగ్గన, అవును అన్యాయం జరిగింది.అది మన దురదృష్టం అంటారు. మరో వంక పొరుగు రాష్ట్రం అవమాన పరిచినా, అవహేళన చేసినా, ముఖ్యమంత్రి చిరు నవ్వుతో తుడిచేసుకుంటారు. అందుకే, వైసీపీ ధోరణిని జాగ్రత్తగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినా  మా ఆస్తులు,మా కేసులే మాకు మాకు ముఖ్యం, అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని అంటున్నారు.అందుకే ఎన్టీఅర్ నిలబెట్టిన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, జగన్మోహన్ రెడ్డి అటు ఢిల్లీకి ఇటు హైదరబాద్’కు తాకట్టు పెట్టారని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.