వాష్‌రూమ్ కిటికీ పగులగొట్టి ఎంట్రీ.. కిలో బంగారు ఆభరణాలు చోరీ..!

Publish Date:Jul 20, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. రోడ్ నెం.10లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. ప్రధాన ద్వారం జోలికి వెళ్లకుండా అత్యంత చాకచక్యంగా వాష్‌రూమ్ కిటికీని ధ్వంసం చేసి మెల్లిగా లోపలికి ప్రవేశించిన దుండగులు, నేరుగా లాకర్ వద్దకు చేరుకుని తమ పని పూర్తి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈరోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది లాకర్ తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించారు. 

అనుమానంతో లాకర్‌ను తనిఖీ చేయగా అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు కార్యాలయాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన 1,028.59 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటిలో ఏడు నెక్లెస్లు, ఏడు జతల చెవిపోగులు ఉన్నట్లు తెలిపారు.గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఫోరెన్సిక్ బృందాలు వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను సేకరించాయి. అలాగే పరిసర ప్రాంతా ల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని దుండగుల కదలికలను విశ్లేషిస్తు న్నాయి. వాష్‌రూమ్ కిటికీని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించడం, నేరుగా లాకర్‌లోని బంగారు ఆభరణాలనే లక్ష్యంగా చేసుకోవడం చూస్తే దుండగులకు ముందస్తు సమాచారం లేదా రెక్కీ ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

Massive theft in Banjara Hills, Kilogram of gold ornaments stolen, Banjara Hills Police, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.