హైదరాబాద్ నగరంలో బడా బాబులను టార్గెట్గా చేసుకొని నేపాలి వాళ్లు గృహ సహాయకులుగా చేరి దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో నేపాలి వాళ్లు పనిచేస్తూ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి పాల్పడిన ఘటన, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో బర్తడే పార్టీ పేరుతో భార్యాభర్తలకు మత్తు పదార్థాలు ఇచ్చి ఇల్లు గుల్ల చేసిన ఘటనలు మరవ కముందే గచ్చిబౌలిలో మరో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు. ఇంటి తాళాలు తలుపులు బలవంతంగా పగలగొట్టిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్ళిపోయారని కుటుంబ సభ్యులు భావించారు. అనంతరం కుటుంబ సభ్యులు పూజ గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చింది. అనంతరం ఇంట్లో పూర్తిస్థాయిలో తని ఖీలు నిర్వహించగా ఇంట్లో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయ మైనట్లుగా గుర్తించారు.
దీంతో బాధిత వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పని చేసే నేపాలీ దంపతులపై అనుమానం వ్యక్తం చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం ఒక కిలో బంగారం చోరీ జరిగిందని, దాని విలువ కోటి రూపా యలు ఉంటుందని బాధిత వ్యాపారి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/massive-theft-at-a-merchant-house-36-222336.html
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్‌బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
1999లో ఒక రైతు కుటుంబం పార్కు కోసం కేవలం 10 డాలర్లకే 87 ఎకరాల భూమిని ఇస్తే, టేలర్ నగరం దాన్ని 10 మిలియన్ డాలర్లకు డేటా సెంటర్ నిర్మించడానికి అమ్మేసింది. ఈ గుండె బరువెక్కించే పూర్తి కథనం చదవండి.
చాట్‌జీపీటీ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు ఓపెన్ఏఐ శ్రీకారం చుట్టింది. కేవలం చాటింగ్ చేసే రోజులకు కాలం చెల్లిందంటూ చాట్‌జీపీటీని సరికొత్త సూపర్ యాప్గా మారుస్తున్నారు. ఈ సంచలన మార్పుల వెనుక ఉన్న పూర్తి వివరాలు, కొత్త ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రాథమికంగా తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎక్కడైనా రోడ్డుపై పెద్ద గుంతలు, అంటే ప్రయాణానికి ఇబ్బంది కలిగించే గతుకులు, గుంతలను గమనిస్తే, వెంటనే వాటి ఫోటోలను తీసి, పూర్తి సమాచారంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.