షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడీ.. రూ.21 లక్షలు స్వాహా!

Publish Date:Jun 14, 2026

Advertisement

 

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం షాదీ ముబారక్ పేరుతో కోట్ల ఆశలు పెట్టుకున్న పేద కుటుంబాల కోసం కేటాయించిన నిధులను కొందరు కేటుగాళ్లు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతో కాజేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లు జరగకపోయినా జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, లబ్ధిదారుల పేరుతో సుమారు రూ.21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన అంతరాష్ట్ర ముఠాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో బండ్లగూడ తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌నగర్‌లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంట్లో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకిలీ పత్రాలు తయారవుతున్నాయన్న సమాచారం అందడంతో అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. 

ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్ హక్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున నకిలీ దరఖాస్తులు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులు లభ్యమయ్యాయి. విచారణలో ఎతిమాద్ ఉల్ హక్ ఆధార్ ఆపరేటర్‌గా పనిచేస్తూ తన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వధువుల ఫొటోలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు సహా పలు కీలక పత్రాలను ఫోర్జరీ చేసినట్లు తేలింది. 

అనంతరం ఆ దరఖాస్తు లను బండ్లగూడ తహసీ ల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు విడుదలయ్యేలా పథకం ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ మోసంలో స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. క్షేత్రస్థాయి ధృవీకరణ లేకుండానే ఫైళ్లను ఆమో దించి నిధులు విడుదలయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మిగిలిన నింది తులు నకిలీ లబ్ధిదారులను సృష్టించడం, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, వచ్చిన డబ్బును పంచు కోవడం వంటి పనుల్లో భాగస్వాములైనట్లు గుర్తించారు.

ఇప్పటివరకు ఈ ముఠా రూ.21 లక్షల మేర ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్, ఆరు మొబైల్ ఫోన్లు, నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడీ ప్రూఫ్‌లు, రూ.21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన అత్తాపూర్ పోలీసు బృందాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ అభినందించారు.


 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.