జపాన్ ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Publish Date:Apr 20, 2026

Advertisement

 

జపాన్ ను  భారీ భూకంపంతో గజగజలాడించింది. పశ్చిమ జపాన్ ప్రాంతంలో  రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్లు చెబుతున్నారు. భూకంపం తరువాత  అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ భూకంపం జపాన్ లోని ఇషికావా పరిధిలోని నోటో ద్వీపంలో సంభవించింది. దాదాపు నిముషం పాటు భూమి కంపించింది.   దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వాజిమా నగరంలో భూకంప తీవ్రత అధికంగా ఉంది. అనేక చోట్ల అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయని సమాచారం. భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం సంభవించిన వెంటనే జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  తీరప్రాంతాల్లో నివసించే వారు ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని మైకుల ద్వారా హెచ్చరించింది.   రైలు సర్వీసులను నిలిపివేశారు మరియు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో  జనం  చీకటిలో మగ్గుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.  కుప్పకూలిన భవనాల శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రాణనష్టంపై స్పష్టత లేదు.   సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం వల్ల మారుమూల గ్రామాలకు చేరుకోవడం రెస్క్యూ టీమ్స్‌కు సవాలుగా మారింది. సునామీ భయం ఇంకా తొలగిపోకపోవడంతో ప్రజలు ఆందోళనలోనే గడుపుతున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా జపాన్ పరిస్థితిని గమనిస్తోంది. జపాన్ ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో ఎంతవరకు తోడ్పడతాయో వేచి చూడాలి. పూర్తి స్థాయి నష్టం అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

By
en-us Political News

  
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.