ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. స్తంభించిన ట్రాఫిక్.. సక్సెస్ ఫుల్ గా సామూహిక జాతీయ గీత
Publish Date:Aug 16, 2022
Advertisement
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం (ఆగస్టు 16) ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంతో పాటు రాష్ట్రమంతటా అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్నినిర్వహించారు. ఆబిడ్స్ కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా కూడళ్లలో నిమిషం పాటు అన్ని వైపులా రెడ్ సిగ్నళ్లు వేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాగా సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా సరిగ్గా 11.30 గంటలకు నిమిషం పాటు ఎక్కడి మెట్రో రైలు అక్కడే నిలిచియాయి. జాతీయ గీతాలాపన అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
http://www.teluguone.com/news/content/mass-national-anthem-successful-metro-stopped-39-141999.html





