భోజనంలోకి చికెన్ లేదని పెళ్లి ఆపేశారు!

Publish Date:Nov 28, 2022

Advertisement

పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ చిన్న చిన్న కారణాలతో కూడా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకుది ఒరిజనల్ జట్టు కాదు.. విగ్గు అని పీటల మీద జీలకర్రా బెల్లం పెడుతున్న సమయంలో బయటపడటంతో పెళ్లి కూతరు పెళ్లికి ససేమిరా అన్న సంగతి గతంలో విన్నాం.

జుట్టు లేకపోతేనేం.. బట్ట తల అయితేనేం అని ఆ అమ్మాయి సరిపెట్టుకోలేకపోయింది. సరే పెళ్లి వద్దనుకొంది. అలాగే పెళ్లిలో బ్యాండ్ లేదని కూడా పెళ్లిళ్లు ఆపేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ కేవలం భోజనాల వద్ద మాటపట్టింపుతో గొడవపడి, ఘర్షణ పడి పెళ్లిని ఆపేసిన సంఘటన తెలంగాణలోని జగద్గిరి గుట్టలో జరిగింది. పెళ్లి భోజనాలలో చికెట్ వడ్డించలేదని పెళ్లి కూతురు తరఫువారితో పెళ్లి కొడుకు తరఫు వారు వాగ్వాదానికి దిగారు.

గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కోట్లాటకు దారి తీసింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఇరువర్గాలూ పోలీసు స్టేషన్లలో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్థిల్లండని దీవించాల్సిన పెద్దలే భోజనాల వద్ద చికెన్ లేదంటూ గొడవపడి పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యారు. మాటపట్టింపులతో   కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కోటి ఆశలతో పీటలపై కూర్చున్న వధూవరులను విడదీయడంపై పెళ్లికి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.