ప్రధానమంత్రి మోదీ వీడియో తొలగింపు.. మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాల్సిందే.!

Publish Date:Aug 4, 2026

Advertisement

 

ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన అధికారిక ఫేస్‌బుక్ వీడియోను తాత్కాలికంగా తొలగించడంపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక  స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ  వ్యవహారంలో సాంకేతిక లోపం సాకును కమిటీ   తిరస్కరిస్తూ, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే నేతృత్వంలో జరిగిన  స్టాండింగ్ కమిటీ సమావేశం  మెటా ప్రతినిధులకు   హెచ్చరికలు జారీ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక   వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది.  ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు  సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.

ఈ వివాదంపై మెటా ప్రతినిధులు వివరణ ఇస్తూ..  సాంకేతిక లోపం కారణంగానే పొరపాటున ఆ వీడియో డిలీట్ అయిందని, విషయాన్ని గుర్తించిన వెంటనే పునరుద్ధరించామని తెలిపారు. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించారు. అయితే.. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు పార్లమెంటరీ ప్యానెల్ కూడా ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. 

విచారణ ఎదుర్కొంటున్న మెటా సంస్థ ప్రతినిధులను ఎంపీలు నిలదీశారు. ప్రధాని వీడియోను తొలగించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, అల్గారిథమ్ ఆధారంగా కంటెంట్ తొలగించే ప్రక్రియలో ఎంతవరకు పారదర్శకత ఉందనే విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్వేషపూరిత, అసభ్యకరమైన కంటెంట్ వేదికలపై పదేపదే కనిపిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోని సంస్థలు, దేశ ప్రధాని అధికారిక సందేశాలను తొలగించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ విషయంలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే..  భారత సమాచార సాంకేతిక చట్టం కింద మెటాకు లభిస్తున్న  సేఫ్ హార్బర్  రక్షణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని  పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే స్పష్టం చేశారు.   

Mark Zuckerberg Apology,  PM Modi Video Remove,  Meta Facebook, IT Parliamentary Committee. India IT Ministry Meta Controversy

By
en-us Political News

  
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
విమాన ప్రయాణం అంటే సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది అని అందరూ భావిస్తారు. కానీ, నింగిలో ప్రయాణిస్తున్న వేళ ఊహించని విపత్తులు ఎదురైతే ఆ అనుభవం
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మూసివేయడానికి లేదా పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.
జగన్ దర్శనం దక్కకుండా సజ్జల అడ్డుకుంటున్నారు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.