బుల్లెట్‌తో కాదు...బ్యాలెట్‌తో మార్పు : సీఎం రేవంత్

Publish Date:Mar 7, 2026

Advertisement

 

 

మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోవడం రాష్ట్ర పోలీసుల ప్రత్యేక కృషికి నిదర్శనమని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి హింస కాదు, ప్రజాస్వామ్య మార్గమే సరైనదని స్పష్టం చేశారు. బుల్లెట్‌తో కాకుండా బ్యాలెట్ ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని నమ్మి ముందుకు వచ్చిన మావోయిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు.


ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆధునిక ఆయుధాలతో లొంగిపోయారని సీఎం వెల్లడించారు. దేశంలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో లొంగుబాటు కావడం ఇదే తొలిసారి అని చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వివరించారు. లొంగిపోయిన మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని సీఎం తెలిపారు. వారికి ఆర్థిక సహాయం, పునరావాసం, మెరుగైన వైద్య సేవలు, నివాసానికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహ సదుపాయం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. హోదాలను బట్టి రివార్డులు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు దేవ్ జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి తదితరులతో తాను చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. వారి సమస్యలు, డిమాండ్లను వినామని, వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ముందుంచిన ప్రతిపాదనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మావోయిస్టు సమస్య కేవలం తెలంగాణకే పరిమితం కాని జాతీయ స్థాయి అంశమని సీఎం పేర్కొన్నారు. దీనిపై కేంద్రంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. 

ఆయుధాలతో తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయే వారికి పూర్తి భరోసా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర కేంద్ర కమిటీ సభ్యులు కూడా ముందుకు వచ్చి లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. గణపతి ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొంటూ, ఆయన ఎక్కడ ఉన్నా ముందుకు వచ్చి లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. వయస్సు, అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గణపతి లొంగుబాటు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో హింసకు తావు లేదని సీఎం స్పష్టం చేశారు. ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే శాంతియుతంగా లొంగిపోతే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని గుర్తుచేసిన సీఎం, ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని అన్నారు. దేశాల మధ్య యుద్ధాలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతే ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
 

By
en-us Political News

  
నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే దేశంలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన రాజీనామాకు దారితీసిన ముఖ్య కారణాలు ఏంటంటే.. గత మే నెలలో జరిగిన బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి స్టార్మర్ నాయకత్వ సామర్థ్యంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది.
భారతీయ రైల్వేస్ థర్మల్ ప్లాంట్ల నుండి 340 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ (బొగ్గు బూడిద) రవాణా కోసం సరికొత్త మెగా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. 40 శాతం డిస్కౌంట్‌తో సిమెంట్, ఇటుకల ధరలను తగ్గించి, వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చే ఈ అద్భుతమైన గ్రీన్ ఇనిషియేటివ్ విశేషాలు ఇక్కడ చదవండి.
కర్ణాటకలో ప్రభుత్వ బస్సు ప్రయాణం మరింత ప్రియం కానుంది. డీజిల్ ధరలు, ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు రూ. 6,000 కోట్ల అప్పుల్లో ఉన్న రవాణా సంస్థలు 12% వరకు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.