ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో మావోల కదలికలు పెరిగాయి. దీంతో మన్యం ప్రాంతంలో అలజడి పెరిగింది, యుద్ధ వాతావరణం నెలకొంది. కొయ్యూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టు సీనియర్ నాయకులు తృటిలో తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఆపరేషన్ కగార్ పేరిట గత కొన్ని నెలలుగా భద్రత దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి విదితమే. చత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత కీలకమైన ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టలు హతమయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్ర ఒడిశా బార్డర్ వైపు వచ్చారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గూడెం కొత్త వీధి క, య్యూరు మండలాల్లో గత రెండు వారాలుగా మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయంటున్నారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందడంతో ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఏవోబీ అడవులను మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సోమవారం( మే 5) ఒక్కరోజే రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. కొయ్యూరు మండలం మందపల్లి పుట్టకోట కంటారాం పరిసరాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి కానీ భద్రతా బలగాల వైపు నుంచి కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రాంతం పై మావోయిస్టు నాయకులకు పూర్తిస్థాయిలో పట్టు ఉండటం, గిరిజన గ్రామాల వారి పట్ల సానుభూతి ఉండటంతో వారి జాడ తెలుసుకోవడం భద్రతా దళాలకు ఒకింత కష్టంగా మారిందంటున్నారు. కాగా సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ల నుంచి సీనియర్ మావోయిస్టు నేతలు తప్పించుకున్నట్లు పోలీసులు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maoist-movements-in-visakhapatnam-forest-area-39-197614.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.