దేశంలో ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్
Publish Date:Dec 27, 2024
Advertisement
ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.ఆయన కు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అసలు ఆర్ధిక సంస్కరణల కోసమే ఆర్ధిక వేత్త మన్మోహన్ ను రాజకీయాలలోకి పీవీ తీసుకువచ్చారు. ఆయన తన ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు .బంగారం తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఆర్ధిక వ్యవస్థ ను సుస్థిరం చేసారు.అలా రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవి వరించింది.రాజ్యసభ సభ్యుడిగానే 10 ఏళ్లు ప్రధానిగా ఆ పదవిలో ఉన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు పొందారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబ్ లో జన్మించిన మన్మోహన్, 1958లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రం చదివి, 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో డాక్టరేటు పొందారు. 1978-80మధ్య రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా,1982-85లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ గా కూడా పని చేశారు. కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసినది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఆయన ఐదు పర్యాయాలు అసోం నుంచి, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఒక్కసారి కూడా లోక్ సభ కు ఎన్నిక కాకపోవడం గమనార్హం. ఆయన ఈ 33ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక గౌరవ పదవులు నిర్వహించారు.ఈ నాటికీ భారత ఆర్థిక వ్యవస్థ చెదరకపోవడానికి ఆనాటి ఆయన ఉక్కు సంకల్పమే కారణమనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి రాజకీయ ఆర్థిక వేత్త భారత్ కు లభించడం,ఆయనను వెలికి తీసిన పీవీ లాంటి మేధావి ఉండడం భారతీయుల అదృష్టం గా భావించాలి. ఆయన నాటిన విత్తే నేటికీ భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఆయన ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఆర్ధిక మంత్రి పదవి,ప్రధానమంత్రి పదవి అనుకోకుండా లభించినా ఆ పదవులకు గౌరవం తెచ్చారు. ప్రధాని పదవికి తన విదేశీయత కారణంగా సోనియా గాంధీ అనర్హురాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలతో ఆమె ఆ పదవికి మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసారు. యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీని కలసి ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలను నిర్ణయాలు తీసుకునేవారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు.
http://www.teluguone.com/news/content/manmohan-architect-of-economic-reforms-39-190386.html