మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Publish Date:Dec 11, 2023

Advertisement

వైసీపీలో  అంతర్గత సంక్షోభం రోజు రోజుకూ తీవ్ర మౌతోంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలెవరూ సంతృప్తిగా లేరనీ,  వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ కన్ఫర్మ్ కాదన్న ఆందోళన దాదాపుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఉందనీ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పార్టీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే విషయంలో ఎలాంటి సంకోచాలూ మొహమాటాలూ లేకుండా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ తమ అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నారు. నేడో రేపో వారంతా పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో  చర్చ జరుగుతూనే ఉంది. ఇహ ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నిజమే. ఎమ్మెల్యేల వలస ఎంతో దూరంలో లేదు అన్న స్పష్టత వచ్చేసింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గత కొద్ది కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తనకు పార్టీ టికెట్ లభించదన్న నిర్ధారణకు వచ్చేసిన ఆళ్ల ఏ మాత్రం ఉపేక్షించకుండా పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యే పదవికి తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే ఆళ్ల ఆ రాజీనామా లేఖ అందించేసినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసేశారు.  మంగళగిరి వైసీపీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవిని నియమించనుండటం, ఆ గంజి చిరంజీవి ఆదివారం (డిసెంబర్ 10) మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న భావనకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ పై విజయం సాధించి జెయంట్ కిల్లర్ గా సంచలనం సృష్టించారు.

అప్పట్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే జగన్ ఎన్నికలకు ముందు లోకేష్ ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన హామీని విస్మరించి తొలి క్యాబినెట్ లో కానీ, ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలో కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్న ఆయన ఇప్పుడు ఇక వచ్చే ఎన్నికలలో టికెట్ కూడా హుళక్కే అని తేలడంతో రాజీనామా చేశారు.  
వైసీపీ ఇన్ ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్న (ఆదివారం) గంజి చిరంజీవి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.