మంగళగిరిలో నారా లోకేష్ కు నల్లేరు మీద బండి నడకే!

Publish Date:Jan 20, 2023

Advertisement

మంగళగిరిలో అధికార వైసీపీకి ఆ పార్టీలోని లీడర్ల నుంచి కేడర్ వరకు అంతా వరుసగా ఝలక్ ఇచ్చారు... ఇస్తున్నారు.  తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, కోమ్మారెడ్డి వీరారెడ్డి, నూతలపాటి నంబూద్రిపాద్, తిరువీధుల నరసింహమూర్తి తదితరులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు.ఇటీవలి కాలంలో  వైసీపీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అలా వలస వస్తున్న వారిలో లీడర్ నుంచి కేడర్ వరకు   ఉంటున్నారు.  

అయితే టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు పోటెత్తడంపై   విపక్ష నేతగా వైయస్ జగన్.. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. అలాగే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఆయన అమలు చేస్తున్న   విధానాలకు ఎక్కడా పొంతన లేదని...  ముఖ్యంగా  రాష్ట్ర రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన  జగన్ అధికారంలోకి రాగానే.. మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారనీ, ఆ కారణంగా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించే మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతోందనీ స్థానికులు చెబుతున్నారు. 

అలాగే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రచారంలో భాగంగా.. నాటి ప్రతిపక్ష నేత  జగన్..  టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తన కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని.. నియోజకవర్గ ప్రజల సాక్షిగా ప్రకటించారు... కానీ వైయస్ జగన్.. తన రెండు కేబినెట్ల కూర్పులో ఎక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కనిపించలేదు.. వినిపించలేదు.  ఇలా   జగన్ ప్రతిపక్షనేతగా మాట తప్పం.. మడం తిప్పమంటూ ప్రకటించి,  ముఖ్యమంత్రి కాగానే.. మాట తప్పేయడం.. మడమ తిప్పేడయం చేశారని నియోజకవర్గ ప్రజల్లు సోదాహరణగా చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి  జంప్ చేసిన  చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి సైతం వైయస్ జగన్... తన కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టారని..  దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకానొక దశలో తీవ్రంగా హర్ట్ అయి.. బుంగమూతి సైతం పెట్టుకున్నారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇప్పటికే   ఎమ్మెల్యే ఆళ్ల... స్వయంగా తన కేడర్ వద్ద పేర్కొన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.  

ఇంకోవైపు గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా నారా లోకేశ్.. గత మూడున్నర్లేళ్లుగా నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలపై  అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారని.. అలాగే  నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ... ఆరోగ్య సంజీవినీ పేరిట మొబైల్ వైద్యశాలలు సైతం ఏర్పాటు చేశారు.

ఇంకోవైపు.. మంగళగిరి టీడీపీలో బలమైన నాయకుడిగా పేరున్న గంజి చిరంజీవి లాంటి వారిని సైతం జగన్ పార్టీ ఆకర్షించేసిందని.. అలాగే వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఎంత చేయాలో అంతా చేసేందు ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎం హనుమంతరావును సైతం ఇలా పార్టీలొకి తీసుకుని..  అలా ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. అలాంటి సమయంలో సైతం.. మంగళగిరి నియోజకవర్గంలోని జగన్ పార్టీలో కీలక నేతలంతా.. వరుసగా సైకిల్ ఎక్కేస్తుండటం పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెబుతోందని అంటున్నారు.

ఇక నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర. జనవరి 27న కుప్పంలో ప్రారంభం కానుంది. దాదాపు 400 రోజుల పాటు.. నాలుగువేల కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగనుంది. అలా నారా లోకేశ్.. ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకొంటూ..ఈ జగన్ ప్రభుత్వంలోని పాలన వైఫల్యాలను తన గళంతో ఎండగడుతూ.. నారా లోకేశ్ ముందుకు సాగనున్నారు.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.