మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలం.. టీమ్ ఇండియా ఘన విజయం.!

Publish Date:Aug 19, 2026

Advertisement

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా  165 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో చెలరేగగా ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా యువ స్పిన్నర్ మావన్ సుతార్ పది వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను గింగిరాలు తిప్పేశాడు.  శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్  స్పిన్ మాయాజాలానికి  ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  

ఈ మ్యాచ్‌లో  రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి  పది వికెట్లు నేలకూల్చి మానవ్ సుతార్ కొత్త చరిత్ర సృష్టించాడు.   భారత స్పిన్ దిగ్గజాలు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ నమోదు చేసిన రికార్డులను బ్రేక్ చేశాడు.  శ్రీలంక గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 

  గాలే టెస్టులో టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది.   యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానంలో నలువైపులా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడి 167 పరుగులు సాధించాడు.  

సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్,  వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్  అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదుచేసింది.  తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కేవలం 284 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో మానవ్ సుతార్ నాలుగు వికెట్ల తీశాడు.  దీనితో భారత్‌కు 178 పరుగుల   తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు.  రిషభ్ పంత్ వేగంగా అర్ధ శతకం సాధించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.  దీంతో  టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే కుప్పకూలింది. ఇక 372 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక..  ధనంజయ డిసిల్వా, సోనల్ దినుషల అర్ధ శతకాలతో చెలరేగడంతో ఒక దశలో విజయం వైపు సాగుతున్నట్లుగా అనిపించింది.

అయితే.. మావన్ సుతార్ స్పిన్ మాయాజాలం శ్రీలంక ఆశలపై నీళ్లు జల్లింది. రెండో ఇన్నింగ్స్ లో సుతార్ అరడజను వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాశించాడు.  దీంతో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 165 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో మానవ్ సుతార్ 131 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.  

ManavSuthar Spin Magic, 10 Wickets, India vs Sri Lanka Test Match, Galle Test Result, Devdutt Padikkal Century, Team India #isttestwin

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.