మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలం.. టీమ్ ఇండియా ఘన విజయం.!
Publish Date:Aug 19, 2026
Advertisement
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 165 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో చెలరేగగా ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా యువ స్పిన్నర్ మావన్ సుతార్ పది వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను గింగిరాలు తిప్పేశాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలానికి ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి పది వికెట్లు నేలకూల్చి మానవ్ సుతార్ కొత్త చరిత్ర సృష్టించాడు. భారత స్పిన్ దిగ్గజాలు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ నమోదు చేసిన రికార్డులను బ్రేక్ చేశాడు. శ్రీలంక గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గాలే టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానంలో నలువైపులా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడి 167 పరుగులు సాధించాడు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదుచేసింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కేవలం 284 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో మానవ్ సుతార్ నాలుగు వికెట్ల తీశాడు. దీనితో భారత్‌కు 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. రిషభ్ పంత్ వేగంగా అర్ధ శతకం సాధించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే కుప్పకూలింది. ఇక 372 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వా, సోనల్ దినుషల అర్ధ శతకాలతో చెలరేగడంతో ఒక దశలో విజయం వైపు సాగుతున్నట్లుగా అనిపించింది. అయితే.. మావన్ సుతార్ స్పిన్ మాయాజాలం శ్రీలంక ఆశలపై నీళ్లు జల్లింది. రెండో ఇన్నింగ్స్ లో సుతార్ అరడజను వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాశించాడు. దీంతో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 165 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో మానవ్ సుతార్ 131 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ManavSuthar Spin Magic, 10 Wickets, India vs Sri Lanka Test Match, Galle Test Result, Devdutt Padikkal Century, Team India #isttestwin
http://www.teluguone.com/news/content/manavsuthar-spin-magic-36-229278.html




