Publish Date:Oct 16, 2020
రైలు ఢీకొట్టడంతో చనిపోయిన ఓ వ్యక్తి తల ఒక రాష్ట్రంలో మొండెం మరో రాష్ట్రంలో దొరకడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని బేతుల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మొండెం మాత్రమే దొరికింది. రైలు పట్టాల పక్కన పడివున్న మృతదేహానికి తల లేకపోగా, మరికొన్ని అవయవాలు కూడా గల్లంతయ్యాయి. బేతుల్ సమీపంలోని మచ్నా బ్రిడ్జి వద్ద అక్టోబరు 3న పోలీసులు తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఆ మృతదేహం తలభాగం బేతుల్ కు 1,300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో లభ్యమైంది. రాజధాని ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో చిక్కుకుని ఉన్న తలను రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తల బేతుల్ వద్ద లభ్యమైన మొండేనిది అని తేలింది. న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరణించిన వ్యక్తిని రవి మర్కమ్ గా గుర్తించారు.
రవి కుటుంబసభ్యులకు బెంగళూరు వెళ్లేంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో బెంగళూరు పోలీసులు అతడి తలను అక్కడే ఖననం చేశారు. బేతుల్ లో లభ్యమైన మొండేన్ని మాత్రం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైలు ప్రమాదంలో చనిపోయిన శరీర భాగాలు రెండు రాష్ట్రాల్లో దొరకడం మృతుడి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/man-gets-hit-by-train-in-madhya-pradesh-39-105206.html
విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.
తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు
మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిలు కోసం నందిగం సురేష్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు ఈ నెల 23తో ముగియనుంది. మొత్తం 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ వరుసగా రెండు పర్యాయాలు ఆప్ అధికారంలో వచ్చింది.
ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు తెలంగాణ సర్కార్ ఇలా కేటీఆర్ పై ముప్పేట దాడి చేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కనీసం అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తినీ తిరస్కరించింది.
ప్రధాని నరేంద్రమోడీ రేపు అంటే బుధవారం విశాఖపట్నం రానున్నారు. పూడి మడకవద్ద ఎన్ టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ఎనిమిదో తేదీ సాయంత్రం శంకు స్థాపన చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది
బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ గురువారం అంటే జనవరి 9న అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మూలా ఈ కార్ కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేయడంతో ఆయనకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి.
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కెటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో నందినగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం ఊపందుకుంది.
తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం సులభ తరం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఈ నెల 10 నుంచి 19 వరకూ భక్తులకు వైకుంఠద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందు కోసం ఈ నెల 9 నుంచి తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో నిండా మునిగారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను కోర్టు మంగళవారం (జవవరి 7) కొట్టి వేసింది.
ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
హ్యూమన్ మెటానిమో వైరస్.. హెచ్ఎంపీవీ వ్యాప్తి వేగం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకూ ఎవరూ చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఉద్ధృతిపై వార్తలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సోమవారం (జనవరి 6) ఒక్క రోజే భారత్ లో ఆరు కేసులు వెలుగు చూడటంతో అందరిలో ఆందోళన మొదలైంది.