పోలీసులు గద్దించటంతో సత్తెనపల్లి లో గుండెపోటుతో యువకుడి మృతి
Publish Date:Apr 20, 2020
Advertisement
సత్తెనపల్లి పట్టణంలో పోలీస్ గట్టిగా గద్దించటం తో, యువకుడు మృతి చెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి వెంకటపతి కాలనీ కి చెందిన మొహమ్మద్ గౌస్ (28), ఉదయం 9 గంటలకు నిత్యావసర సరుకుల కోసం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయిన మొహమ్మద్ గౌస్ ను పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన మొహమ్మద్ గౌస్ కు పెళ్లి అయినది. ఇద్దరు చిన్న పిల్లలు సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ ముందునుండి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.బయటకు ఎందుకొచ్చావ్ అని ప్రశ్నించిన పోలీసులకు సరైన సమాధానం ఇవ్వని గౌస్. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో భయంతో కుప్పకూలిపోయిన గౌస్. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఐజి ప్రభాకర్ రావు వెల్లడించారు. కాగా, సత్తెనపల్లిలో మృతుడి బంధువుల ఆందోళనలు ఉద్రిక్తం. శవంతో రోడ్డుపై ఆందోళనలు.సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ, ఏఎస్పీలు. మృతుడి బంధువులతో చర్చిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. ఘటన పై విచారణ ప్రారంభించినట్లు ఏఎస్పీ ప్రకటన. ఈ రోజు మధ్యాహ్ననికి జిల్లా ఎస్పీకి నివేదిక అందచేస్తామన్నారు. కాగా, సత్తెనపల్లిలో ఉద్రిక్తతలపై చంద్రబాబు దిగ్భ్రాంతి. ముస్లిం యువకుడు గౌస్ మృతి చెందడంపై చంద్రబాబు దిగ్భ్రాంతి. గౌస్ పై పోలీసుల దాడిని ఖండించిన చంద్రబాబు. మందుల దుకాణానికి వెళ్లిన ముస్లిం యువకుడిపై దాడి గర్హనీయం. మృతుడి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలి. పోలీసులు దురుసుగా వ్యవహరించరాదు. అన్నివర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఈ విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావంతో వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.
http://www.teluguone.com/news/content/man-dead-in-sattenapalli-family-alleges-beaten-by-police-39-97975.html





