హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Publish Date:Apr 14, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుండి భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.మలక్‌పేటలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ రేపాలా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 7న బ్యాంక్‌లోని క్యాష్ రీసైక్లర్ మెషీన్‌లో జమ చేసిన నోట్లను పరీక్షించగా 500 ముఖ విలువ కలిగిన 10 నకిలీ నోట్లను గుర్తించారు. 

UV లైట్ పరీక్షలు, నోట్ల స్కానింగ్ యంత్రాలు కూడా అదే విషయాన్ని నిర్ధారించడంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ ట్రాన్సాక్షన్లను పరిశీలించగా, ఈ నకిలీ నోట్లను మార్చి 27న చంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్‌కు చెందిన అహ్మద్ పాషా(33) అనే వ్యక్తి ఖాతాలో జమ చేసినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే అహ్మద్ పాషా ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వృత్తిరీత్యా కసాయిగా పని చేసే అహ్మద్ పాషా, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి నుంచి నకిలీ కరెన్సీ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అసలు డబ్బుగా చలామణి చేయాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ వద్ద మొత్తం 94,000 విలువైన నకిలీ నోట్లను సేకరించినట్లు వెల్లడించాడు. అందులో రూ. 5,000 బ్యాంకులో జమ చేయగా, మిగిలిన 89,000 విలువైన 178 నకిలీ నోట్లు అతడి ఇంటి వద్దే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపైu/s179,318(4)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల ప్రకారం ఈ నకిలీ కరెన్సీ సరఫరా గుజరాత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తేలింది. ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నగరంలో నకిలీ కరెన్సీ చలామణి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

By
en-us Political News

  
మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే ఈ బోనాల ఉత్సవాల శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల పండుగ ఒక ఉత్సవం మాత్రమే కాదనీ, అది సమాజంలో విభిన్న వర్గాల మధ్య ఐక్యతను, సహోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.