బీజేపీకి  ప్రత్యామ్నాయంగా  బలమైన కూటమి! తమిళనాడు ఎన్నికలే కీలకం! 

Publish Date:Dec 28, 2020

Advertisement

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన పడింది. బీజేపీ మాత్రం రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీకి ధీటుగా పోరాడే శక్తి కాంగ్రెస్ కు లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా  బలమైన కూటమి కోసం  ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.  కొత్త కూటమి అయితే సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడున్న  యూపీఏనే బలోపేతం చేసే యోచనలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వేదిక కాబోతున్నాయని సమాచారం. 
         
తమిళనాడులో మేలో  కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అంటే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఇప్పటికే తమిళనాడులో రాజకీయాలు  వేడెక్కాయి. తమిళనాడులో పాగా కోసం బీజేపీ శ్రమిస్తున్నా.. వారికి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు. రజనీకాంత్ పార్టీ పెడితే... బీజేపీతో కలిసి పోటీ చేయవచ్చని భావించారు. కాని హైదరాబాద్ లో  అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన రజనీకాంత్.. హాస్పిటల్ నుంచి డాశ్చార్జ్ అయినా ... ఆయన ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో డిసెంబర్ 31న చేస్తానన్న రజనీకాంత్ రాజకీయ ప్రకటన లేనట్టేనని తెలుస్తోంది.  ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కేంద్ర సర్కార్ తో సఖ్యతగానే ఉన్నా... తమిళనాడుకు వచ్చే సరికి మాత్రం ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీతో కలిసి సర్కార్ పంచుకునే అవకాశం లేదని అన్నాడీంకే స్పష్టం చేసింది. డీఎంకే ఎలాగూ బీజేపీకి బద్ద వ్యతిరేకమే. 
 
 జనవరి తొలి వారంలోనే చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతోంది. శశికళ ఎంట్రీ తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రంజుగా మారిపోనున్నాయి.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017లో శశికళను దోషిగా తేల్చిన కోర్టు నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అప్పటి నుంచి ఆమె బెంగళూరులోని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జనవరిలో జైలు నుంచి రానున్న శశికళ.. రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఆమె అనుచరులు పార్టీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారంటున్నారు. శశికళ పార్టీ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తాను జైలుకు వెళ్లడానికి బీజేపీనే కారణమనే భావనలో శశికళ ఉన్నారని ఆమె అనుచరుల వాదన.  తమిళనాడులో ఏ విధంగా చూసినా బీజేపీకి కలిసి వచ్చే పార్టీలు కనిపించడం లేదు.అవసరమైతే బీజేపీని ఎదుర్కొనేందుకు.. అన్నాడీఎంకే మినహా మిగితా పార్టీలు ఏకమయ్యే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 తమిళనాడు రాజకీయ పరిణామాల తరహాలోనే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి బలమైన శక్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూపీఏ కూటమికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను చీఫ్ గా నియమించి.. ఆ దిశగా అడుగులు వేయవచ్చని చెబుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని, ప్రాంతీయ పార్టీలతో ఆమె సమావేశం జరిపింది కూడా ఇందు కోసమేనని చెబుతున్నారు. రైతు సమస్యలపై మాట్లాడుకున్నామని మమత చెబుతున్నా అంతర్గతంగా జరిగింది మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి బలోపేతం పైనేనని పక్కాగా తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి శివసేన కూడా అంగీకరిస్తోంది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో శరద్ పవార్ ను ప్రశంసిస్తూ సంపాదకీయం వచ్చింది. పవార్ ఆ పదవిని స్వీకరిస్తానంటే తమకే అభ్యంతరం లేదని.. పవార్ ఆ పదవికి అన్ని విధాలా అర్హులని మిత్రపక్షం శివసేన అందులో  స్పష్టం చేసింది.   

మొత్తంగా పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో టీఎంసీ విజయం సాధిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా  బలమైన కూటమి ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టేనని  చెబుతున్నారు. మమత, స్టాలిన్, శివసేనల డైరెక్షన్ లోనే శరద్ పవార్ నేతృత్వంలో బలమైన కూటమి రావచ్చంటున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించడం వల్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ.. తమ చేతుల్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తోందని, అందుకే కేసీఆర్, జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు సాగించిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత గతంలో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని రాజకీయ అనలిస్టులు ఉదాహరణగా చూపుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.