దీదీ గుండెల్లో పార్దా గుబులు

Publish Date:Jul 26, 2022

Advertisement

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్. రాజకీయ పోరాటాలకు పెట్టింది పేరు.అన్నిటినీ మించి,కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్వే విషయంలో ఆమె అందరికంటే ముందుంటారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీని, డోంట్ కేర్  పద్దతిలో దూషించడంలో అయినా, దుర్భాషలాడడంలో కేసీఆర్ అయినా కేజ్రీవాల్ అయినా ఆమె తర్వాతనే. చివరకు అల్ పవర్ఫుల్  కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా, (వ్యంగ్యంగానే అయినా) వామ్మో .. మమత అన్నారంటే ఆమె ఎంత పవర్ఫుల్ లీడరో అర్థం చేసుకోవచ్చును. అలాగే, ఆమె ఎవరికీ భయపడరు. భయం అంటే ఏమిటో ఆమెకు తెలియదని అంటారు. 
అది నిజమే కావచ్చును. కానీ, అంతటి మమత బెనర్జీ కూడా ఇప్పుడు భయపడుతున్నారా, అంటే, మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ అరెస్టు విషయంలో ఆమె స్పందించిన తీరు చూస్తే, నిజంగానే ఆమె భయపడుతున్నారని అనుకోవలసి వస్తోందని అంటున్నారు. ఉపాధ్యాయుల నియామ‌కానికి సంబంధించిన కుంభ‌కోణంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయనతో పాటుగా ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలోనే, ఈడీ నోట్ల కట్టలు కాదు కరెన్సీ కుప్పలు స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలు అలా కుప్పలు పోయడం చూసిన జనం, ముక్కున వేలేసుకుంటున్నారు.
అదలా ఉంచితే, మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని అరెస్ట్ తర్వాత మమతా బెనెర్జీ పూర్తిగా  రెండు రోజులు పెదవి విప్పలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అరెస్ట్ అయిన మంత్రి నాలుగు సార్లు ఫోన్ చేసినా, రిప్లై  అయినా ఇవ్వలేదు. అంటే, ఆ కుంభ కోణం తన మెడకు చుట్టుకుంటుందనే భయమేదో ఆమెను వెంటాడుతోడని అనుకోవచ్చును.
అంతే కాదు, మంత్రి అరెస్ట్ పై రెండు రోజుల ఆలస్యంగా స్పందించినా, అందులోమ ఢీ అంటే ఢీ అనే దీదీ కనిపించలేదని  అంటున్నారు. గతంలో డీజీపీ కార్యాలయంలో సోదాలు చేసేందుకు వెళ్ళిన సిబిఐ అధికారుల పై మమత బెజేర్జీ విరుచు పడ్డారు. స్వయంగా రోడ్డెక్కి నిరసన  తెలిపారు. కానీ  మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ విషయంలో మాత్రం,  రోడ్ షో లు లేవు  సరికదా, త‌ప్పులు చేసేవారికి, అవినీతికి పాల్ప‌డేవారికి తాను ఎప్పుడూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌న‌ని అన్నారు, త‌ప్పుచేసిన‌వారు ఎలాంటివారైనా, వారు త‌ప్పుచేసిన‌ట్లు నిరూపిత‌మైనా, యావ‌జ్జీవ‌ శిక్ష ప‌డినా తాను ఏమీ అనుకోన‌న్నారు. ఇటువంటి అవినీతి వ్య‌వ‌హ‌రాల్లోకి త‌న‌ను లాగొద్ద‌ని.. ఎందుకంటే తాను ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే వేత‌నం కూడా తీసుకోవ‌డంలేద‌ని తెలిపారు. అంటే, మమత బెనర్జీ భయపడుతున్నారు అనుకుంటే తప్పులేదని అంటున్నారు. 
కాగ, ఈ కేసులో మంత్రి ఛ‌టర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేయ‌డంతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. సోదాల్లో మంత్రికి మ‌రిన్ని అక్ర‌మాస్తుల‌న్న‌ట్లు అధికారులు గుర్తించారు. వీరిద్ద‌రితోపాటు మంత్రి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సుకాంత ఆచార్య‌ను కూడా అరెస్ట్ చేశారు. 2014-2021 మ‌ధ్య‌లో విద్యాశాఖ మంత్రిగా కొన‌సాగిన పార్థా మీద ఆరోప‌ణ‌లు రావ‌డంతో సుదీర్ఘంగా 26 గంట‌ల‌పాటు ఆయన్ను విచారించిన ఈడీ త‌మ అదుపులోకి తీసుకుంది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.