వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.!
Publish Date:Aug 5, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నేత, విశాఖ వెస్ట్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు బుధవారం (ఆగస్టు 4) ఉయదం సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు బీహార్ కు చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్, విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు, అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలు మళ్ల విజయ ప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డిపాజిట్ల సేకరణ, ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. 2009, 2014 మధ్యకాలంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్లు సేకరించి, డిపాజిటర్లను మోసం చేశారనే ఆరోపణలు వెల్ఫేర్ గ్రూప్ సంస్థపై వచ్చాయి. ఈ కేసులో గతంలోనే ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈవెడబ్ల్యు), సీబీఐ సైతం విచారణ చేపట్టాయి. ఇప్పుడు ఈ కేసు పరిధిలో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల సమయంలో పలు కీలక పత్రాలు, డిజిటల్ డేటా , హార్డ్ డిస్క్‌లు, బ్యాంకు ఖాతా పుస్తకాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ సోదాల్లో లభ్యమైన ఆధారాలు, సీజ్ చేసిన ఆస్తులు, నగదు లావాదేవీల వివరాలకు సంబంధించి ఈడీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Malla Vijay Prasad, ED Raids, YSRCP Leader, Visakhapatnam News, Chit Fund Fraud, Enforcement Directorate
http://www.teluguone.com/news/content/malla-vijay-prasad-36-228049.html





