తిరుపతిలో మల్లారెడ్డి వర్సిటీ.!

Publish Date:Jul 11, 2026

Advertisement

 తెలంగాణ రాజకీయాల్లో, విద్యా రంగంలో  ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న  విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇప్పుడు   ఆంధ్రప్రదేశ్ లో తన విద్యాసంస్థల ఏర్పాటుపై   దృష్టి సారించారు.  ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విద్యా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు  లభించాయని వెల్లడించారు. 

శుక్రవారం (జులై 10)  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి,  మీడియాతో మాట్లాడుతూ   గత మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ నిరంతర సేవలు అందిస్తున్నానన్న ఆయన.. పవిత్ర తిరుపతి నగరంలో ఒక అద్భుతమైన యూనివర్సిటీని స్థాపించాలనేది తన స్వప్నమని చెప్పారు. ఆ స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోందన్నారు.  నిజానికి గత ఏడాదే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన   ఆలోచన చేశాననీ,  అది  ఇప్పుడు కార్యరూపం దాల్చిందని మల్లారెడ్డి చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు,  మెడికల్ కాలేజీలు మరియు డీమ్డ్ యూనివర్సిటీలతో అత్యంత బలమైన విద్యా నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న మల్లారెడ్డి..  ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విస్తరణ ప్రణాళికల్లో భాగంగానే ఆయన గతేడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. అంతటితో ఆగకుండా, అదే ఏడాది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని మరో కీలక నగరమైన విశాఖపట్నంలోనూ ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా..  దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రమాణాలతో కూడిన మరిన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నదే తన  లక్ష్యమని ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పారు.  

Malla Reddy Varsity in Tirupati, Tirupati Deemed University, Malla Reddy AP Colleges, Medchal MLA, University Expansion, Malla Reddy Educational Institutions

By
en-us Political News

  
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డిమాండ్ కారణంగా ఏర్పడిన HBM మెమొరీ కొరతను అధిగమించేందుకు ఏఎండీ AMD సంచలన నిర్ణయం తీసుకుంది. 32GB సామర్థ్యంతో కూడిన LPDDR5X మెమొరీ-ఆన్-ప్యాకేజ్ టెక్నాలజీ వివరాలు ఇక్కడ చూడండి.
2026 నేషన్స్ ఛాంపియన్‌షిప్‌లో రగ్బీ దిగ్గజం న్యూజిలాండ్ All Blacks మరియు ఇటలీ జట్ల మధ్య జరగనున్న ఉత్కంఠభరిత మ్యాచ్ వివరాలు, గత రికార్డులు మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా, ఇరాన్‌ల మధ్య సైనిక ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా 140 నుండి 40 నౌకలకు పడిపోయింది. అమెరికా 90 ఇరాన్ స్థావరాలపై దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో బదులిచ్చింది. చమురు, గ్యాస్ సంక్షోభంపై లేటెస్ట్ అప్‌డేట్స్.
టాటా అసెట్ మేనేజ్‌మెంట్ Tata Asset Management నూతన సీఈఓ మరియు ఎండీగా ఆనంద్ వరదరాజన్ నియమితులయ్యారు. ప్రతిత్ భోబే స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆనంద్ కెరీర్ మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మ్యూచువల్ ఫండ్స్ రంగంలో సరికొత్త హిస్టరీ నమోదైంది. జూన్ నెలలో ఎస్‌ఐపీ స్టాపేజ్ రేషియో 91.23 శాతానికి పడిపోగా, కొత్త ఎస్‌ఐపీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పూర్తి వివరాలు మరియు తాజా రికార్డుల గణాంకాలు ఇవే!
వారెన్ బఫెట్ వారసుడు, బెర్క్‌షైర్ హాత్వే కొత్త సీఈఓ గ్రెగ్ ఏబెల్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో బిలియన్ల డాలర్ల భారీ పెట్టుబడులు పెడుతున్నారు. బఫెట్ ఆపిల్ బెట్ తరహాలోనే ఈ గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్ సంచలనం సృష్టిస్తుందా పూర్తి వివరాలు, గణాంకాలు ఇక్కడ చూడండి.
జూలై 11 శనివారం నాడు దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ లేటెస్ట్ పసిడి రేట్లు మరియు తగ్గుదల వివరాలను ఇక్కడ పూర్తి గణాంకాలతో చూడండి.
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై 2 1 తేడాతో స్పెయిన్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. మికెల్ మెరినో లేట్ విన్నింగ్ గోల్, లామిన్ యమాల్ అద్భుత ప్రదర్శనతో లా రొజా జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో టి20 సిరీస్ ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో ఇంగ్లండ్‌పై వన్డే ప్రతీకారానికి సిద్ధమైంది. పూర్తి వన్డే షెడ్యూల్ మరియు స్క్వాడ్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో నలుగురు కీలక అమెరికా సెనెటర్లు ఇప్పటికే ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడం అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు కనుక పూర్తి స్థాయిలో చట్టంగా మారి అమల్లోకి వస్తే.. భారతదేశంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ దారుణ నరమేధంలో నిందితుడు కేవలం ఫిర్యాదుదారులనే కాకుండా, తన స్వంత భార్యను, పిల్లలను కూడా వదలకుండా ప్రాణాలు తీయడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులను కూడా నిందితుడు దారుణంగా హత్య చేశాడు.
బహామాస్ రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి పది మంది ప్రయాణీకులతో బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
చర్చల కోసం ఇరాన్ తమను అభ్యర్థించిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. తాము అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రతినిధుల పర్యటనను మాత్రమే అంగీకరించామని కుండబద్దలు కొట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.