వీఐపీల భద్రతలో భారీ కోత..రేవంత్ సర్కార్ నిర్ణయానికి కారణమేంటంటే?

Publish Date:Jun 29, 2026

Advertisement

తెలంగాణలో వీఐపీల భద్రతలో సీఎం రేవంత్ భారీగా కోత విధించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు అందిస్తున్న సెక్యూరిటీని భారీగా తకోత విధించాలని తీసుకున్న   అధికార, ప్రతిపక్షాల మధ్య  మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ప్రభుత్వం కుదించడంతో   వివాదం మరింత ముదిరింది. ప్రవీణ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ..  ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు  ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే..  ఇదంతా నిబంధనల మేరకే  ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు  కౌంటర్ ఇస్తున్నారు. ఎవరికైనా నిజంగా ప్రాణభయం ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని.. భద్రత కుదింపు అంశాన్ని రాజకీయం చేయొద్దనీ అధికారులు అంటున్నారు.  

అయితే..  తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో  తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది. అదలా ఉంటే..  ఈ సానుకూల మార్పులను నిశితంగా సమీక్షించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇకపై కొంతమంది ప్రముఖులకు గతంలో ఇచ్చిన విధంగా అదనపు భద్రతను కొనసాగించాల్సిన అవసరం లేదని  అభిప్రాయపడింది. అందులో భాగంగానే..  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వంద మంది ప్రముఖులకు ప్రస్తుతం అందుతున్న వివిధ రకాల భద్రతా సౌకర్యాలను పూర్తిగా ఉపసంహరించుకోవడమో లేదా కుదించడమో చేయాలని  అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇందులో భాగంగా వీఐపీలకు కేటాయించిన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు గన్‌మెన్‌ల సౌకర్యాలను కూడా వెనక్కి తీసుకోనున్నారు. గతంలో కొందరి ప్రముఖుల రక్షణ కోసం "వన్ ప్లస్ వన్  స్థాయి సెక్యూరిటీ ఉండగా, మరికొందరి రక్షణ కోసం అత్యంత కీలకమైన టూ ప్లస్ టూ స్థాయి గన్‌మెన్‌ల భద్రత ఉండేది. ఇప్పుడు ఈ క్యాటగిరీలన్నింటినీ పునఃసమీక్షించి భారీగా కోత విధించింది. ఈ కోత మంగళవారం (జులై 1) నుంచే అమలులోకి రానుంది.  

ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ క్యాటగిరీలలో  భద్రత  కల్పిస్తోంది. ఈ భారీ జాబితాలో ప్రస్తుత, మాజీ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, సమాజంలో పలుకుబడి ఉన్న  ముఖ్య వ్యక్తులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సిబ్బందిని, వనరులను కేవలం వీఐపీల భద్రతకే పరిమితం చేయడం కంటే, ప్రజా రక్షణకు మళ్లించడం ఎంతో ఉత్తమమని ప్రభుత్వం యోచిస్తోంది. మావోయిస్టు ముప్పు లేని వారికి భద్రతను తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే వృథా వ్యయాన్ని భారీగా అరికట్టవచ్చని, అలాగే పోలీసు వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందనడానికి  స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది. 

By
en-us Political News

  
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో సోమవారం ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి.
అల్వాల్‌లో సంచలనం సృష్టించిన నిత్య పెళ్లికొడుకు కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ తీపి కబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక రాజధానిగా అమరావతి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌..
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి...
కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.