Publish Date:Jul 19, 2023
2012లో యుపీఏకూటమి నుంచి వైదొలగిన ఎంఐఎం కు ప్రతి పక్ష కూటమిలో భాగస్వామ్యం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమిలో ఎంఐఎం కు కనీసం ఆహ్వానం అందకపోవడం గమనార్హం. మొత్తం 24 ప్రతిపక్ష పార్టీల్లో ఎంఐఎంకు చోటు దక్కకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భాగ్య లక్ష్మి వివాదం కేసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలను అరెస్ట్ చేసింది. అప్పట్లో ఎంఐఎం కేవలం 7గురు శాసనసభ్యులను మాత్రమే కలిగి ఉంది.
గత నెలలో జరిగిన ప్రతిపక్ష కూటమి పాట్నాలో సమావేశమైనప్పుడు కేవలం 16 పార్టీలను ఆహ్వానిస్తే ప్రస్తుతం మరో 8 రాజకీయ పక్షాలకు ఆహ్వానం అందింది. అయినప్పటికీ ఆహ్వానం అందకపోవడంతో ఎంఐఎం వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఇటీవలె బీఆర్ఎస్ తో స్నేహ సంబంధాలను తెంచుకున్న ఎంఐఎం బిజెపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగా ఆహ్వానం అందకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసే అసద్ ప్రస్తుతం మెతక వైఖరి ప్రదర్శించడం కారణం కావొచ్చు అని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/majlis-not-in-opposition-25-158594.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.