పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై.. టీపీసీసీ చీఫ్ ఫైర్..!

Publish Date:Aug 14, 2026

Advertisement

 

ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన వెల్లడించారు. ఎంతటి ముఖ్యాధికారి లేదా ప్రజాప్రతినిధి అయినా సరే, పార్టీ గీసిన లక్ష్మణరేఖను దాటి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలు  అధిష్టాన నిర్ణయాలే సర్వోపరి అని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని, ఆయన మనస్తాపం  ఆవేదన వెనుక ఉన్న కారణాలను తాము అర్థం చేసుకోగలమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. 

అయితే, వ్యక్తిగత అసంతృప్తులు ఏవైనా ఉంటే పార్టీ వేదికలపైనే చర్చించాలి తప్ప బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ ఒక్కరి స్వయంప్రతిపత్తికైనా క్రమశిక్షణే ప్రాతిపదిక అని పీసీసీ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే నాయకులపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మంత్రివర్గ విస్తరణ  పదవుల కేటాయింపులపై పలువురు సీనియర్ నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కాకరేపాయి. 

ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ, అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడటం ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పీసీసీ అధ్యక్షుడు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు  కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి క్లారీటీ ఇచ్చారు. నిన్న చేసిన కామెంట్స్‌పై మరోసారి వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే ఉంటానని  రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud, Komatireddy Rajgopal Reddy, Telangana Congress News, TPCC Chief Warning, CM Revanth reddy, Congress party

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.