‘మహా’ పాఠం మరో గుణ పాఠం

Publish Date:Jun 23, 2022

Advertisement

అది ఉద్ధవ్‌ ఠాక్రేనే కానక్కరలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కావచ్చును. కాదంటే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చును, దేశాన్ని పాలిస్తున్న ప్రధాన మంత్రి అయినా కావచ్చును. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా ప్రవర్తిస్తే, అంతా బాగుందని, అనుకుంటే, ఇదిగో ఇలాగే, ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఉరమని ఉరుములా, ‘మహా’ విపత్తు విరుచుకు పడుతుంది. అలా,  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా, ఉద్ధవ్‌ ఠాక్రే’లా లబో దిబో మన్నా ప్రయోజనం ఉండదు. అర్థరాత్రి పెట్టే బేడా సర్దుకుని, పోవడం తప మరో మార్గం ఉండదు. అయితే, పాలకుల తలలో చేరిన అజ్ఞాన, ఆహంకారానికి  అన్ని సందర్భాలో పార్టీలో అంతర్గత తిరుగుబాటే  సమాధానం కానవసరం లేదు. చివరాఖరికి ప్రజలు ఇచ్చే తీర్పు రూపంలోనూ, ప్రజలు గుణ పాఠం చెపుతారు. నేతలకు కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి ఎదురైనా కావచ్చును. 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఓడి పోయిన తర్వాత, ఎంతవరకు నిజమో ఏమో కానీ, మీడియాలో ఒక ప్రచారం జరిగింది. ‘ఓటమి ఓకే .. కానీ, మరీ ఇంత ఘోరంగానా? మనంచేసిన తప్పేంటి .. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏమిటి? అంటూ చంద్రబాబు నాయుడు, పార్టీ  సమావేశాల్లో విస్మయం వ్యక్త పరిచినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్త పరిచింది నిజం అయినా కాకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను చూడలేక పోవడం ఎంత ప్రమాదకరమో చెప్పుకునేందుకు ఈ  ఉదంతం ఒక గుణపాఠంగా అయితే నిలిచింది.  ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో ఈ ప్రమాదం మరి కొంత ఎక్కువగా ఉంటుంది. అధినాయకుడు నందంటే నంది, కాదంటే  కాదు..అనే అతి విధేయత జాతీయ పార్టీలలో కంటే ప్రాంతీయ పార్టీలలో కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది.

ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అదే పరిస్థితి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, ఇన్ని మీటలు నొక్కాం... ఇన్ని వందల వేల కోట్లు ప్రజల ఖాతాలలో జమ చేశాము...సో .. 175 కు 175 సీట్లు మనకే వస్తాయి, ఎందుకు రావు? అంటూ పార్టీ  సమావేశంలో  విశ్వాసం  వ్యక్త పరిచారు. అది విశ్వాసం అనాలో అతి విశ్వాసం అనాలో గానీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అలా ఉందా ? అని ఒక్క నిముషం ఆలోచిస్తే, అలంటి పరిస్థతి లేదని చెప్పడం కష్టం కాదు.   ప్రభుత్వ పథకాల వలన ప్రయోజనం పొందిన ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అందుకే, గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు ఎక్కడిక్కడ ఎమ్మెలను నిలదీశారు. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అబ్బే అదేమి లేదు, అంతా బాగుంది అనే భ్రమల్లోనే ఉన్నారంటే, అది ఆయనలోని అజ్ఞానానికి నిదర్శనమా,  అహంకారానికి నిదర్శనమా అనేది ఆయనే తెలుసు కోవలసి ఉంటుంది  తప్ప మరొకటి కాదని,వైసీపీ నేతలే అంటున్నారు.

ప్రజలను కొనేయడం అంత పెద్ద విషయమే కాదనే దురహంకారంతోనే ఆయన అంతోటి ధీమా వ్యక్తం చేశారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదనే  వైసీపీ పెద్దలు ‘దీవెనలు ’ కూడా అందిస్తున్నారు.  ఇక  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం అయితే చెప్పనే  అక్కరలేదు. రాష్ట్రంలో ఇక చేసేందుకు ఏమీ లేదనే నిర్ణయానికి ఎలా వచ్చారో ఏమో కానీ, దేశాన్ని ఉద్దరించేందుకు  సిద్ద మయ్యారు. జాతీయ రాజకీయాల వెంట పడ్డారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే, రైతులకు ఎప్పుడో ఇవ్వవలసిన రైతు బంధు పైసలకు ఇంతవరకు దిక్కు లేదు. ఎక్కడన్నా, అప్పు పుడితేనే కానీ, రైతుల ఖాతాల్లో పైసలు పడవు. పోయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం అప్పుకు పోయినట్లు, తెలగాణ ప్రభుత్వం రైతు బంధు అప్పు కోసం పరుగులు తీస్తోంది.

ఇదొక్కటని కాదు,  రాష్ట్రంలో కాదు, ఏ దిక్కు చుసిన అష్టమ దిక్కే కనిపిపిస్తోంది. శాంతి భద్రతలు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నాయో, వేరే చెప్పనక్కరలేదు. మరో వంక అప్పులు, అవినీతి సమాంతరంగా ఉర్ద్వ ముఖ ప్రయాణం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అయినా, జగన్ రెడ్డి కి ఏమాత్రం తీసి పోకుండా, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు మావే అంటున్నారు కేసీఆర్.  అవును నిన్న మొన్నటి దాకా , ఉద్ధవ్‌ ఠాక్రే’ కూడా ఇలాగే, అహంకారం చూపారు. జగన్, కేసీఆర్  అయినా మరొకరు అయినా అందుకు అతీతులు కాదు, కదా...

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.