Publish Date:Jun 29, 2022
తెలుగువన్ చెప్పినట్లే జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైతే.. అంతకు ముందే సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తారని తెలుగువన్ ముందే ఊహించింది. చివరికి అదే జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. అసెంబ్లీలో గురువారం (జూన్ 30) బలపరీక్ష జరగాల్సి ఉండగా దానికి ఆపాలంటూ ఆయన సుప్రీం ను ఆశ్రయించారు.
అయితే మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు బుధవారం సాయంత్రం బలపరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీం ఆదేశాలు జారీ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఉద్ధవ్ థాక్రే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందజేశారు. బల పరీక్షపై స్టే విధించడం కుదరదన్న సుప్రీం తీర్పును గౌరవిస్తున్నానని ఉద్ధవ్ అన్నారు.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శివసనే సర్కార్ కు కొందరి ద్రిష్టి తగిలిందనీ, అది ఎవరిదో అందరికీ తెలుసుననీ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చిందన్నారు.
సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. రాజీనామాకు ముందు ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్ ధన్యవాదాలు తెలిపారు. ఏమైనా తప్పు జరిగితే అందరూ తనను మన్నించాలని ఠాక్రే కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచి ఈ స్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు.
సుప్రీం తీర్పుకు ముందే తెలుగువన్ ఉద్ధవ్ రాజీనామా గురించి చెప్పింది.
https://www.teluguone.com/news/content/thakrey-to-resign-if-cant-avoid-floor-test-25-138717.html
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-cm-uddhav-thakrey-resigb-39-138742.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.