టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్.. ఇప్పుడు ఎమ్ఆర్ఎస్!

Publish Date:Oct 25, 2024

Advertisement

బీఆర్ఎస్ పార్టీకి పేరుతో పెద్ద చిక్కే వచ్చిపడింది. టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలు పెట్టిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు అనుకూలంగా అందరి మద్దతూ పొందింది. సరే తెరాస ఉద్యమాల కారణంగానో.. అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనివార్యత వల్లో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ కంటే.. కోట్లాడి తెలంగాణ సాధించాను అన్న కేసీఆర్ మాటనే ప్రజలు విశ్వసించారు. సరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు తెరాసకే పట్టం కట్టారు. ఉద్యమ పార్టీగా జనం తెరాసను గుండెల్లో పెట్టుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది కాలానికే తెరాస అధినేత కేసీఆర్.. తెరాస ఉద్యమ కార్యాచరణ ముగిసిందనీ, ఇక తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. అక్కడ నుంచి ఇతర పార్టీల నేతలకు పార్టీ తలుపులు బార్లా తెరిచేసి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు.

సరే రెండో మారు అధికారంలోకి వచ్చిన తరువాత  కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తీవ్ర ఆకాంక్షతో పార్టీ పేరును మార్చేశారు. అంటే  టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది. ఆ సందర్భంగా ఆయన చేసిన హడావుడీ, హంగామా అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ ను విస్తరించారు.  మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఔరంగాబాద్, నాందేడ్ లలో భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా,  ఆ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి దాదాపు 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆ హడావుడి, ఆర్భాటం చూసి మహారాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ అత్యంత కీలకం కాబోతున్నదని అంతా ఊహించారు.  

అయితే 2023 డిసెంబర్ లో  జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఈ ఓటములతో కేసీఆర్ దాదాపుగా అజ్ణాతవాసంలోకి వెళ్లిపోయారు.  దీంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు జంప్ అయిపోయారు. పార్టీలో ఉన్న నేతలకు కనీసం కేసీఆర్ దర్శన భాగ్యం కూడా కలగని పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో  మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరును ఎమ్ఆర్ఎస్ గా మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశారు. మహారాష్ట్ర రాజ్య సమితిగా భారత రాష్ట్ర సమితి పేరు మార్పునకు వారు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్, రైతు సంఘాల మద్దతుతో మహారాష్ట్ర ఎన్నికలలో కనీసం80 స్థానాలలో ఎమ్ఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు.  సో.. కత్తీ పోయి కర్రా వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లు  టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చే.. బీఆర్ఎస్ పోడి ఎమ్ఆర్ఎస్ వచ్చే అనుకోవాల్సి ఉంటుంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.