సంక్షోభంలో మహా సంకీర్ణం.. సంజయ్ రౌత్‌పై ఈడీ నజర్..

Publish Date:Apr 6, 2022

Advertisement

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల కూటమి మహావికాస్ అగాధి సర్కార్’  అధికార పగ్గాలు చేపట్టి ఇంచు మించుగా రెండున్నర సంవత్సరాలు కావస్తోంది. ఆది నుంచి సంకీర్ణంలో లుకలుకలున్నా,ఇంతవరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సాఫీగానే సాగుతోంది. అయితే, ఇప్పుడు ఓ వంక కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. శివసేన కాంగ్రెస్ పార్టీల మధ్య యూపీఏ నాయకత్వం విషయంగా దూరం పెరిగింది. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యాన్మాయం కాలేదని,  యూపీఏ నాయకత్వం నుంచి కాంగ్రెస్ తప్పుకుని మరొకరికి పగ్గాలు అప్పగించాలని, శివసేన అధికార  పత్రిక సామ్నా’ ప్రచురించి సంపాదకీయ కథనంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. శివసేన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీనే కాదు, మహావికాస్ అగాధి మరో కీలక భాగస్వామ్య పార్టీ అధినేత శరద్ పవార్, కూడా తిరస్కరించారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. మరో వంక కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు శివసేనతో తెగతెంపులు చేసుకోవాలని కోరుతూ, కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సో ... మహావికాస్ అగాధిలో ఒక విధంగా శివసేన ఒంటరి అయింది. 

మరో వంక ఉద్ధవ్ థాకరే సోదరుడు, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే శివసేన హిందుత్వాన్ని సవాలు చేస్తున్నారు. మసీదులఫై స్పీకర్’లను తొలిగించాలని లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసా వినిపిస్తామని సవాలు విసిరారు. మరో వంక రాజ్ థాకరే  బీజేపీకే దగ్గరవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలా నాలుగు దిక్కుల నుంచి సమస్యలు ఎదురవుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

ఇదలా ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మాజీ మిత్ర పక్షం శివసేన మీద దండ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఐటీ, ఈడీని రంగంలోకి దింపింది. కొద్ది రోజుల క్రితం వేల కోట్ల విలువైన పత్రా చాల్ భూకుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్‌ మాధవ్‌ ఆస్తులనూ జప్తు చేసిన ఈడీ, ఇప్పుడు తాజాగా అదే కేసులో శివసేన మరో కీలక నేతపై వల విసిరింది. శివసేనలో ముఖ్యమంత్రి  ఉద్ధవ్ థాకరే తర్వాత నంబర్ 2గా ఉన్న రాజ్యసభ ఎంపీ, పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాకిచ్చింది. సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ‘రూ.1, 034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మీడియాకు సమాచారం  అందజేసింది.శివసేన,ఎన్సీపీ నేతల్ని ఒక్కరుగా టార్గెట్ చేస్తూ వస్తోన్న కేంద్ర నిఖా సంస్థలు.. ఇప్పుడు ఏకంగా శిసేనకు కుడిభుజంలాంటి సంజయ్ రౌత్ పై తీవ్ర చర్యలకు సిద్దమవుతోంది. 

అలాగే, ఇప్పటికే అరడజను మందికి పైగా, శివసేన, ఎన్సీపీ  కీలక నేతల మెడకు ఉచ్చు బిగించిన ఈడీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత దూకుడు పెంచింది. కేంద్ర విచారణ సంస్థలను  బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రత్యర్థులపై ప్రతీకారానికి వాడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తీవ్రంగా విరుచుకు పడ్డారు. అయినా, కేంద్రం మాత్రం విపక్షాల విమర్శలను పట్టించుకోవడం లేదు. విచారణ సంస్థలు తమ పని చేసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మహావికాస్ అగాధి ప్రభుత్వం మనుగడ, అదే విధంగా ముఖ్యమత్రి ఉద్ధవ్ థాకరే, శివసేన భవిష్యత్  ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అయితే, మహావికాస్ అగాధి కూటమి ఇరుసుగా శరద్ పవార్ ఉన్నంత వరకు సర్కార్ మనుగడకు ముప్పు లేదని అంటున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.