ముగింపు దశకు మహా కుంభమేళా.. అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక

Publish Date:Feb 25, 2025

Advertisement

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గత 45 రోజులుగా అత్యంత వైభవోపేతంగా, ఆశేష భక్త జనవాహినితో జరుగుతున్న మహా కుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26) శివరాత్రి తో ముగియనున్నది. ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా.. అంచనాలకు అందని వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు. 

మహాకుంభమేళాలో ఫిబ్రవరి 22 నాటికే    పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరింది. బుధవారంతో ఈ కుంభమేళా ముగియనున్నది. కుంభమేళా ముగిసే సరికి పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  గంగ,యమునా,సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు అచరించడానికి  దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇంతటి మహోత్తర ఆధ్మాత్మిక పండుగ మళ్లీ  144 ఏళ్ల తరువాత గానీ రాదు. దీతో  జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముగింపు సమీపిస్తున్నప్పటికీ మహాకుంభ్ కు వస్తున్న భక్త జనం పోటెత్తుతూనే ఉన్నారు. 

మహాకుంభ మేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయగలిగినంతా చేసింది. అయితే మౌనీ అమావాస్య రోజు న అంచనాలకు మించి భక్త జనం పోటెత్తడంతో దురదృష్ట వశాత్తూ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో  30 మంది చనిపోయారు.  రెండు మూడు సార్లు టెంట్లలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ చిన్నచిన్న అపశ్రుతులు వినా మహాకుంభమేళా నిర్వహించడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. 

అధ్యాత్మిక సౌరభాల సంగతి అలా ఉంచితే.. మహా కుంభమేళా  అతి పెద్ద వ్యాపార కేంద్రంగా నిలిచిందని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఈవేడుక సందర్భంగా వస్తువులు,సేవలు ద్వారా 3లక్షలకోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని సీఏఐటీ పేర్కొంది.ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, దుస్తులు, పూజా సామాగ్రి, హస్తకళలు, ఆరోగ్యరక్షణ, ప్రకటనలు, పౌరసేవలు,టెలీకం,మోబైల్,సీసీ టీవీకేమెరాలు,ఇతర పరికరాల వ్యాపారాలు భారీ స్థాయిలో జరిగాయని గణాంకాలతో సహా వివరించింది.

 ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టతకు మహాకుంభమేళా ఎంతగానో దోహదపడింది. .యూపీ ప్రభుత్వం మహా కుంభమేళా నిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా ఉపయోగించింది. కుంభమేళా ప్రదేశం 4 వేల ఎకరాల వైశాల్యంలో 2750 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంది.ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు నిరంతరం అందించాయి. ఎంతమంది వస్తున్నారు,పార్కింగ్ స్థలంలో వాహనాలు సంఖ్య, కూడళ్లలో రద్దీ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా యూసీ సర్కార్ ఈ ఏర్పాట్లు చేసింది.    మహాకుంభ్ సందర్బంగా 45 రోజులపాటు 24X7 దేదీప్యమానంగా వెలుగొందిన ప్రయాగ్ రాజ్  మహాశివరాత్రి తరువాత వెలవెలబోతుంది. దేశ జనాభా 145 కోట్లు. వీరిలో  110 కోట్ల మంది హిందువులు. మహాకుంభ్ ముగిసే సరికి  65 కోట్లమంది పైగా పుణ్య స్నానాలు ఆచరించారంటే.. దాదాపు దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యారని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.