దేశ్ కీ నేతా కేసీఆర్ ప్రచారం పట్ల ‘మహా’ రైతుల ఆగ్రహం

Publish Date:Sep 28, 2022

Advertisement

దేశ్ కీ నేత అనిపించుకోవాలన్న అత్యుత్సాహంతో కేసీఆర్ నేల విడిచి చేస్తున్న సాము బూమరాంగ్ అయ్యింది. తెలంగాణ అభివృద్ధిని జాతీయ పత్రికలు మీడియాలో కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనంతో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేసి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఉత్సాహంతోనే పక్కనున్న మహారాష్ట్ర రైతులు కూడా  కేసీఆరే ప్రధాని కావాలని, జాతీయనేతగా ఉండాలని కోరుతున్న ట్టు ఒక వార్త  తెలంగాణకు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైంది.  ఆ వార్తే ఇప్పుడు కేసీఆర్ బిల్డప్ నంతా ఒక్క సారిగా కుప్పకూల్చేసింది. తాము కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకోవడం లేదనీ, అసలు కేసీఆర్ వల్ల తమకు వీసమెత్తు ఉపయోగం లేకపోగా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోయామనీ మహారైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా కాళేశ్వరం కారణంగా తాము భూములు కోల్పోయామనీ, ఇంత వరకూ తెలంగాణ తమకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని వారు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కారణంగా మహారాష్ట్రలోని  15 గ్రామాల రైతులు పంటలు పండిం చు కోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు నష్టపోయిన తమకు తెలంగాణ ప్రభుత్వం కనీసం పరి హారం కూడా ఇవ్వలేదని వారంతా వాపోయారు. కేసీఆర్ పనితీరుతో తీవ్రంగా నష్టపోయిన తాము ఆయన్ని ఎలా సమర్థిస్తామని మండిపడ్డారు.

నష్టపరిహారం కోసం కోర్టుకు వెళతామని హెచ్చరించారు. తాము కేసీఆర్ ను జాతీయ నేతగా ఆహ్వానిస్తు న్నట్లుగా వచ్చిన వార్తలోని ఫొటోలు తమవే కానీ వాటిని ఫేస్ బుక్ లోంచి తస్కరించి ఆ వార్తకు వాడుకు న్నారని వారు ఆరోపిస్తున్నారు.  కేసీఆర్ ప్రచారం కోసం తమ ఫొటోలను తమ అనుమతి లేకుండా వాడుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలం గాణాకు చెందిన ఆ వార్తాప‌త్రిక త‌మ అభిప్రాయం తెలుసుకోకుండానే తమ ఫొటోలు వేసి తామేదో కేసీఆర్ కు ఆహ్వానాలు పలుకుతున్నట్లు, బ్రహ్మరథం పడుతున్నట్లు వార్తలు ప్రచురించి ప్రచారం చేసుకోవడమేమిటంటూ మండి పడుతు న్నారు.  తెలంగాణా, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో  సిరోంచ తాసీల్దా రు కార్యాల‌యం వ‌ద్ద   రైతులు నిర‌స‌న తెలియ‌జేస్తూ ఆ వార్తాప‌త్రిక కాపీల‌ను  త‌గుల‌బెట్టారు.  వాస్త‌వానికి, తాము కేసీఆర్‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోర‌నే లేద‌ని, అస‌లు కేసీఆర్ ఆశ‌ల‌కి, కంటున్న క‌ల‌ల‌కి త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌నివారు కుండబద్దలు కొట్టారు. సదరు పత్రికలో వచ్చిన వార్తతో తమకు ఇసుమంతైనా సంబంధం లేదని స్పష్టం చేశారు.  

మహారాష్ట్ర రైతుల నిరసనతో జాతీయ రాజకీయాలంటూ దూకుడు ప్రదర్శిస్తున్న కేసీఆర్ పరువు జాతీ యస్థాయిలో మంటగలిసిందని బీజేపీ వారు సంబరపడుతున్నారు. కర్నాటక రైతు లు కూడా కేసీఆర్ చేసుకుంటున్న ఇటువంటి ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు  ఆ రాష్ట్రా నికి చెందిన నాయ కులు చెబుతున్నారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు ఇతర రాష్ట్రాల రైతుల నుంచి ఆగ్రహా వేశాలు వ్యక్తం కావడంతో ఆయన జాతీయ రాజకీయాల వైపు ఆయన అడుగులు ఎలా ముందుకు పడతా యన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.